ఐసోలేషన్‌లో శిఖర్ ధావన్, మనీశ్ పాండే?... కెప్టెన్‌‌గా భువనేశ్వర్ కుమార్!...

First Published Jul 28, 2021, 3:49 PM IST

లంక టూర్‌లో ఉన్న కృనాల్ పాండ్యాకి కరోనా పాజిటివ్ రావడంతో మిగిలిన రెండు టీ20 మ్యాచులపై సందిగ్ధత నెలకొంది. కృనాల్ పాండ్యాతో మరో 8మంది క్రికెటర్లు క్లోజ్ కాంటాక్ట్ అవ్వడం, వారిని గుర్తించి ఐసోలేషన్‌కి తరలించడంతో రెండో టీ20లో ఎవరు ఆడతారు? ఎవరు ఆడడం లేదనే విషయంలో క్లారిటీ రావడం లేదు...

కరోనా సోకిన కృనాల్ పాండ్యాను వేరే హోటల్‌కి తరలించిన అధికారులు, అతని కోసం ప్రత్యేక ఐసోలేషన్ ఏర్పాట్లు చేశారు. అతనితో క్లోజ్ కాంటాక్ట్ ఉన్న 8మంది భారత క్రికెటర్లు కూడా తప్పనిసరిగా వారం రోజుల క్వారంటైన్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
undefined
అయితే కృనాల్ పాండ్యాతో క్లోజ్ కాంటాక్ట్ ఉన్న వారిలో కెప్టెన్ శిఖర్ ధావన్ కూడా ఉన్నాడనే వార్త, క్రికెట్ ఫ్యాన్స్‌ను అయోమయానికి గురి చేసింది...
undefined
శిఖర్ ధావన్‌తో పాటు సీనియర్ బ్యాట్స్‌మెన్ మనీశ్ పాండే, పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్, కృష్ణప్ప గౌతమ్, హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, యజ్వేంద్ర చాహాల్... కృనాల్ పాండ్యాతో క్లోజ్ కాంటాక్ట్ ఉన్నవారిలో ఉన్నట్టు సమాచారం...
undefined
యంగ్ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు. పడిక్కల్, కృనాల్ పాండ్యాతో కాంటాక్ట్ అయ్యాడా? లేదా? అనేది తేలాల్సి ఉంది...
undefined
పడిక్కల్, కృనాల్ పాండ్యాను కలవలేదని తేలితే మాత్రం, నేటి మ్యాచ్ ద్వారా అతను అంతర్జాతీయ ఆరంగ్రేటం చేయడం ఖాయమైపోతుంది.
undefined
కెప్టెన్ శిఖర్ ధావన్ ఐసోలేషన్‌లో ఉండడంతో మిగిలిన రెండు టీ20 మ్యాచులకు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది...
undefined
సీనియర్ బ్యాట్స్‌మెన్లుగా ఉన్న శిఖర్ ధావన్, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, మనీశ్ పాండే‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లో ఎంతో అనుభవం ఉన్న పృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్ కూడా దూరం కావడంతో బ్యాటింగ్‌లో భారత జట్టుకి ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్నారు అభిమానులు.
undefined
బ్యాటింగ్‌ విభాగంలో మిగిలిన దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రాణా, సంజూ శాంసన్ మాత్రమే మిగలడంతో సిరీస్ జరుగుతుందా? లేదా? అనే విషయంపై అనుమానాలు రేగుతున్నాయి.
undefined
click me!