ఫిట్‌నెస్ లేదా, ఆట బాలేదా? నన్ను ఎందుకు సెలక్ట్ చేయలేదు... సౌరాష్ట్ర వికెట్ కీపర్ షెల్డన్ జాక్సన్...

Published : Jun 11, 2021, 01:15 PM IST

టీ20 వరల్డ్‌కప్‌కి ప్రాక్టీస్‌గా నిర్వహిస్తున్న శ్రీలంక టూర్‌కి భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. 20 మంది ప్లేయర్లతో ప్రకటించిన ఈ జట్టులో దేవ్‌దత్ పడిక్కల్, రుతరాజ్ గైక్వాడ్, నితీశ్ రాణా, చేతన్ సకారియా, కృష్ణప్ప గౌతమ్ వంటి కొత్త కుర్రాళ్లకు కూడా అవకాశం దక్కింది. అయితే దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న తనకి ఎందుకు చోటు ఇవ్వలేదని వాపోయాడు సౌరాష్ట్ర వికెట్ కీపర్ షెల్డన్ జాక్సన్.

PREV
110
ఫిట్‌నెస్ లేదా, ఆట బాలేదా?  నన్ను ఎందుకు సెలక్ట్ చేయలేదు... సౌరాష్ట్ర వికెట్ కీపర్ షెల్డన్ జాక్సన్...

ఐపీఎల్ 2021 సీజన్‌లో పర్ఫామెన్స్ తర్వాత చేతన్ సకారియాకి టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. అతనితో పాటు విజయ్ హాజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీల్లో రాణించిన దేవ్‌దత్ పడిక్కల్‌కి కూడా ఛాన్స్ ఇచ్చింది బీసీసీఐ...

210

అయితే దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతూ టీమిండియాలో చోటు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సౌరాష్ట్ర వికెట్ కీపర్ షెల్డన్ జాక్సన్‌కి మాత్రం మరోసారి నిరాశే ఎదురైంది....

310

రెండు రంజీ ట్రోఫీ సీజన్లలో 800లకు పైగా పరుగులు చేసిన షెల్డన్ జాక్సన్, 76 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 49.22 సగటుతో 5634 పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో టాప్ ప్లేయర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నా, బీసీసీఐ సెలక్టర్లు మాత్రం అతన్ని పట్టించుకోవడం లేదు...

410

మహేంద్ర సింగ్ ధోనీ, దినేశ్ కార్తీక్, వృద్ధిమాన్ సాహా, రిషబ్ పంత్ వంటి వికెట్ కీపర్ల కారణంగా తనని పక్కనబెడుతున్నారని భావించిన షెల్డన్ జాన్సన్, శ్రీలంక టూర్‌లో తనకి చోటు ఉంటుందని ఎంతగానో ఆశించాడట.

510

అయినా అతనికి ఈసారి కూడా అదృష్టం దక్కలేదు. ఇషాన్ కిషన్, సంజూ శాంసన్‌లను వికెట్ కీపర్లుగా ఎంపిక చేసిన సెలక్టర్లు, 34 ఏళ్ల షెల్డన్ జాన్సన్‌ను పక్కనబెట్టేశారు. దీంతో తన మనసు విరిగిపోయిందంటూ ట్వీట్ చేశాడు షెల్డన్ జాక్సన్...

610

‘అవును.. నా వయసు 34 ఏళ్లు. అయితే నేను 22, 23 ఏళ్ల కుర్రాళ్ల కంటే బాగా పర్ఫామ్ చేస్తున్నా. మంచి పర్ఫామెన్స్ ఇస్తున్నా సరే, వయసు పెరిగితే జాతీయ జట్టుకి సెలక్ట్ చేయకూడదని ఎక్కడ రాసి ఉంది?..

710

నా టాలెంట్‌ని నిర్ణయించడానికి వీళ్లేవెరు? అసలు ఏ ప్రతిపాదకన వాళ్లు నన్ను తక్కువ చేస్తున్నారు? నేను రంజీల్లో స్కోరు చేయలేదా? లేక ఫిట్‌నెస్ లేదా... రెండు, మూడు సీజన్లుగా 800-900 పరుగులు చేయడమంటే అంత తేలికయ్యే పనేనా...

810

ఫిట్‌నెస్ లేని ప్లేయర్ ఇలా పరుగులు సాధించగలడా? నాలో నిలకడ లేదా? మరి ఎందుకు నన్ను ఎంపిక చేయలేదు. చాలాసార్లు నేను 30 ఏళ్లు దాటేశానని విన్నాను.  వయసును బట్టి ప్లేయర్లను ఎంపిక చేయాలని ఎక్కడ రాసి ఉంది... ’ అంటూ సీరియస్ అయ్యాడు షెల్డన్ జాక్సన్.

910

లిస్టు ఏ వన్డేల్లో 60 మ్యాచులు ఆడిన షెల్డన్ జాక్సన్, 2096 పరుగులు చేశాడు. టీ20ల్లో 59 మ్యాచులు ఆడి 1240 పరుగులు చేశాడు. అయితే ఐపీఎల్‌లో మాత్రం అతనికి తుదిజట్టులో ఆడే అవకాశం రాలేదు. 

1010

ప్రతీసారి ప్లేస్ కోసం ఎదురుచూడడం, నిరాశగా నెట్‌ప్రాక్టీస్‌తోనే సీజన్ ముగించడం చేస్తున్నాడు షెల్డన్ జాక్సన్. 2021 సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు తరుపున ఆడుతున్న జాక్సన్‌ ఆటకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే సెలక్టర్లు మాత్రం అతన్ని పట్టించుకోవడం లేదు. 

click me!

Recommended Stories