గుజరాత్ టైటాన్స్ కాదు, మినీ సన్‌రైజర్స్... ఆరెంజ్ ఆర్మీ నుంచి టైటాన్స్‌లోకి ఆ నలుగురు...

First Published Dec 26, 2022, 2:23 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగి, టైటిల్ విజేతగా నిలిచింది గుజరాత్ టైటాన్స్. కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యాని, హెడ్ కోచ్‌గా ఆశీష్ నెహ్రాని ప్రకటించినప్పుడే గుజరాత్ టైటాన్స్, ఆఖరి పొజిషన్‌లో నిలుస్తుందని కామెంట్లు చేశారు చాలామంది. అయితే ఆ అంచనాలన్నీ టైటాన్స్ తలకిందులు చేసింది...

Image credit: PTI

వరుస విజయాలతో నాకౌట్‌కి అర్హత సాధించిన మొదటి టీమ్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్, మొదటి క్వాలిఫైయర్‌లో, ఫైనల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ని ఓడించి... మొదటి సీజన్‌లోనే టైటిల్ కైవసం చేసుకుంది...

డిఫెండింగ్ ఛాంపియన్‌గా 2023 మినీ వేలంలో పాల్గొన్న గుజరాత్ టైటాన్స్... కేన్ విలియంసన్‌, ఓడియన్ స్మిత్, కెఎస్ భరత్, శివమ్ మావి, వుర్విల్ పటేల్, జోషువా లిటిల్, మోహిత్ శర్మలను కొనుగోలు చేసింది...

సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో కీ బౌలర్‌గా ఉన్న రషీద్ ఖాన్‌ని రూ.15 కోట్లు ఇచ్చి మరీ జట్టులోకి తెచ్చుకుంది టైటాన్స్... కేన్ మామకి రూ.14 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... రూ.12 కోట్లు డిమాండ్ చేసిన రషీద్ ఖాన్‌ని బయటికి సాగనంపింది...

Image credit: PTI

సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో రూ.9 కోట్లు తీసుకున్న రషీద్ ఖాన్... గుజరాత్ టైటాన్స్ తరుపున రూ.15 కోట్లు తీసుకుంటుంటే... ఆరెంజ్ ఆర్మీలో రూ.14 కోట్లు తీసుకున్న కేన్ విలియంసన్, టైటాన్స్‌కి రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌కి ఆడబోతున్నాడు.

Image credit: PTI

రషీద్ ఖాన్‌తో పాటు ఇప్పుడు కేన్ విలియంసన్ కూడా గుజరాత్ టైటాన్స్‌లో చేరాడు. అంతేనా గుజరాత్ టైటాన్స్‌లో ఉన్న వృద్ధిమాన్ సాహా, విజయ్ శంకర్ కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి వెళ్లినవాళ్లే...

గుజరాత్ టైటాన్స్ టీమ్ ఇప్పుడు మినీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టులా మారిందని అంటున్నారు నెటిజన్లు. తొలి సీజన్‌లో టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన గుజరాత్ టైటాన్స్... ఈసారి భారీ అంచనాలతో బరిలో దిగుతోంది. తొలి సీజన్‌లో దక్కిన విజయం గాలివాటుది కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత పాండ్యా సేనపై ఉంది.. 

click me!