పాక్ కెప్టెన్ మా ప్రాణం.. అతడి కోసం చావడానికైనా సిద్ధం : షాన్ మసూద్ షాకింగ్ కామెంట్స్

Published : Mar 07, 2023, 05:38 PM IST

Babar Azam:  పాకిస్తాన్ క్రికెట్ జట్టు సారథి బాబర్ ఆజమ్  పై గత కొంతకాలంగా విమర్శలు వర్షం కురుస్తుండగా అతడి జట్టు  సహచరులు మాత్రం  కెప్టెన్ కు అండగా నిలుస్తున్నారు. 

PREV
16
పాక్ కెప్టెన్ మా ప్రాణం.. అతడి కోసం చావడానికైనా సిద్ధం : షాన్ మసూద్ షాకింగ్ కామెంట్స్

గత కొంతకాలంగా స్వదేశంలో  జాతీయ జట్టు  చెత్త ప్రదర్శనలకు బాధ్యుడిని చేస్తూ   పాకిస్తాన్ జట్టు బాబర్ ఆజమ్ పై విమర్శలు  వెళ్లువెత్తుతున్న విషయం  తెలిసిందే. గతేడాది ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్ ను సొంతగడ్డమీదే చిత్తు చేశాయి. 

26

వరుస వైఫల్యాలకు తోడు బాబర్ బ్యాటింగ్ కూడా  విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా టీ20లలో అతడు ఆడే ఆట  అది  టెస్టుల కంటే అధ్వాన్నంగా ఉందని  పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు అతడి మీద దుమ్మెత్తిపోస్తున్నారు.  బాబర్.. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుని   సుదీర్ఘ ఫార్మాట్ మీద దృష్టి పెట్టాలని, పొట్టి ఫార్మాట్ లో  మరో కెప్టెన్ ను నియమించాలని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 

36

కొంతకాలంగా బాబర్ ను టెస్టు జట్టు సారథిగా తొలగిస్తారని..  ఆ స్థానంలో షాన్ మసూద్ ను  కెప్టెన్ చేస్తారని  వార్తలు వినిపించాయి. అది నిజమేనా..? అన్నట్టుగా  వన్డే ఫార్మాట్లో ఆ జట్టు షాన  మసూద్  ను వైస్ కెప్టెన్ గా చేసింది. తాజాగా అదే మసూద్.. బాబర్ కు  మద్దతుగా నిలిచాడు. బాబర్ అంటే తమకు ప్రాణమని.. అతడి కోసం ప్రాణాలివ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపాడు. 

46

సామా టీవీతో మసూద్ మాట్లాడుతూ.. ‘మేమంతా  (పాకిస్తాన్ టీమ్)  బాబర్ కు మద్దతుగా నిలుస్తాం. మా  మాజీ సారథి సర్ఫరాజ్ అహ్మద్ కోసం మా ప్రాణాలివ్వడానికి కూడా మేం సిద్ధపడేవాళ్లం. ఇప్పుడు బాబర్ కోసం కూడా అదే చేస్తాం...’అని వ్యాఖ్యానించాడు. 

56

ఇటీవలి కాలంలో  పాకిస్తాన్ జట్టు టెస్టులలో దారుణ ప్రదర్శనల నేపథ్యంలో మసూద్ స్పందిస్తూ... ‘మా అందరి కామన్ గోల్ దేశం గర్వపడేలా ఆడటం. ఈ క్రమంలో మేం  చాలా  న్యూస్ వింటున్నాం.  మా జట్టు గురించి పాక్ నుంచే పలువురు  వారికి నచ్చిన విధంగా మాట్లాడుతున్నారు.  అయితే టీమ్ ప్రదర్శనను విమర్శిస్తే ఫర్వాలేదు గానీ మమ్మల్ని వ్యక్తిగతంగా కూడా దూషిస్తున్నారు... 

66

మాలో మాకు ఎవరితో ఎవరికీ  సమస్యల్లేవు.  మేమంతా పాకిస్తాన్ కు ఆడుతున్నాం. అదే మమ్మల్ని ఐక్యంగా ఉంచుతున్నది...’ అని  తెలిపాడు. బాబర్ ఆజమ్ తో పాటు షాన్ మసూద్ కూడా ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) లో భాగమయ్యాడు.  

click me!

Recommended Stories