షాహీన్ ఆఫ్రిదీ, ఐపీఎల్‌కి వస్తే ఈజీగా రూ.15 కోట్లు పలుకుతాడు.. రవిచంద్రన్ అశ్విన్ కామెంట్...

Published : Sep 01, 2022, 07:19 PM IST

ఐపీఎల్‌ వేలంలో భారీ హిట్టర్ల కంటే ఆల్‌రౌండర్లు, ఫాస్ట్ బౌలర్లకే ఎక్కువ డిమాండ్. 2020 ఐపీఎల్‌ వేలంలో ఆస్ట్రేలియా  ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ రూ.15.5 కోట్లు దక్కించుకుంటే, 2021 వేలంలో సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ ఏకంగా రూ.16.25 కోట్లు దక్కించుకున్నాడు.. పాక్ బౌలర్ షాహీన్ ఆఫ్రిదీకి కూడా ఈ రేంజ్ ధర పలకవచ్చని అంటున్నారు భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్...

PREV
15
షాహీన్ ఆఫ్రిదీ, ఐపీఎల్‌కి వస్తే ఈజీగా రూ.15 కోట్లు పలుకుతాడు.. రవిచంద్రన్ అశ్విన్ కామెంట్...
Shaheen Afridi-Shahid Afridi

2008 ఐపీఎల్‌లో షాహిదీ ఆఫ్రిదీ, కమ్రాన్ అక్మల్, షోయబ్ అక్తర్, షోయబ్ మాలిక్ వంటి ఫాస్ట్ బౌలర్లు పాల్గొన్నారు. అయితే భారత్, పాక్ మధ్య సంబంధాలు చెడిపోవడంతో ఐపీఎల్‌లో పాక్ ప్లేయర్లపై నిషేధం విధించింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీసులు కూడా జరగడం లేదు...

25
shaheen

అయితే ఐపీఎల్‌లో పాక్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిదీ వేలానికి వస్తే... ఈజీగా రూ.14-15 కోట్లు వస్తాయని అంటున్నారు రవిచంద్రన్ అశ్విన్. ‘ఐపీఎల్ వేలంలో పాక్ బౌలర్ షాహీన్ ఆఫ్రిదీ వేలానికి వస్తే ఎలా ఉంటుందనే క్రేజీ ఆలోచన నాకు వచ్చింది...

35
shaheen

షాహీన్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. అతను ఎత్తు కూడా ఎక్కువే. కొత్త బంతితో అద్భుతమైన యార్కర్లు వేస్తూ టాప్ క్లాస్ బ్యాటర్లకు చుక్కలు చూపించగలడు. డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ పరుగులు రాకుండా నియంత్రించగలడు...

45
shaheen

ఇన్ని అర్హతలు ఉన్న ఏ బౌలర్‌కి అయినా ఐపీఎల్‌లో బ్రహ్మరథం పడతారు. నాకు తెలిసి అతనికి ఐపీఎల్ వేలంలో ఈజీగా రూ.14-15 కోట్లు వచ్చేస్తాయి. పాక్ బౌలర్లు అందరూ 140-145 యావరేజ్ స్పీడ్‌తో బౌలింగ్ చేస్తున్నారు...

55

నాకు తెలిసి ప్రపంచంలో ఏ టీమ్‌కి కూడా ఇలాంటి ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ లేదు. షాహీన్ ఆఫ్రిదీ లేకపోయినా పాక్ బౌలర్లు, భారత జట్టును ఆఖరి ఓవర్‌ వరకూ అడ్డుకోగలిగారు...’ అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు రవిచంద్రన్ అశ్విన్...

click me!

Recommended Stories