షెఫాలీ వర్మ చిచ్చర పిడుగు ఇన్నింగ్స్... వీరేంద్ర సెహ్వాగ్‌‌ని గుర్తుకుతెచ్చిన టీనేజర్...

First Published Jun 18, 2021, 4:20 PM IST

టీమిండియాలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు షెఫాలీ వర్మ. 17 ఏళ్ల ఈ అమ్మాయి, వీరేంద్ర సెహ్వాగ్‌లా బౌలర్లపై విరుచుకుపడుతోంది. సచిన్ టెండూల్కర్ క్లాస్, వీరూ మాస్ కలగలిపి షాట్స్ కొడుతూ క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరుస్తోంది...

ఏడేళ్ల విరామం తర్వాత టీమిండియా మహిళా జట్టు ఆడుతున్న తొలి టెస్టులో చోటు దక్కించుకున్న టీనేజర్ షెఫాలీ వర్మ, రెగ్యూలర్ ఓపెనర్ స్మృతి మంధానతో కలిసి ఓపెనింగ్ చేసింది. ఈ ఇద్దరూ కలిసి మొదటి వికెట్‌కి 167 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.
undefined
ఆరంభం నుంచే ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడిన షెఫాలీ వర్మ 152 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 96 పరుగులు చేసింది. టీమిండియా మహిళా జట్టు తరుపున ఆరంగ్రేట ప్లేయర్‌కి ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు.
undefined
సెంచరీకి చేరువైన తర్వాత కూడా హిట్టింగ్‌కి దిగిన షెఫాలీ, మొదటి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌‌లోనే సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకుంది.
undefined
షెఫాలీ వర్మ అవుటైన తర్వాత కొద్దిసేపటికే 155 బంతుల్లో 14 ఫోర్లతో 78 పరుగులు చేసిన స్మృతి మందాన కూడా అవుట్ అయ్యింది... ఓపెనర్లు అవుట్ అయిన తర్వాత వరుస వికెట్లు కోల్పోయింది భారత జట్టు...
undefined
పూనమ్ రౌత్ 2 పరుగులు చేయగా శిఖా పాండే డకౌట్ అయ్యింది. కెప్టెన్ మిథాలీరాజ్ 2 పరుగులకే అవుట్ కాగా, హర్మన్‌ప్రీత్ కౌర్ 4 పరుగులు చేసి పెవిలియన్ చేరింది.
undefined
వికెట్ కీపర్ తానియా భాటియా కూడా డకౌట్ కావడం, స్నేహ్ రాణా 2 పరుగులు చేసి అవుట్ కావడంతో ఒకానొక దశలో 1670 స్కోరువద్ద ఉన్న టీమిండియా, 197 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. 30 పరుగుల తేడాతో భారత జట్టు 8 వికెట్లు కోల్పోవడం విశేషం.
undefined
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 3969 వద్ద డిక్లేర్ చేసింది. భారత జట్టు ఇంకా, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకి 200+ పరుగులు వెనకబడి ఉంది. భారత జట్టు మిగిలిన వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోరుకే కుప్పకూలితే, నాలుగు రోజుల ఈ టెస్టులో ఫలితం తేలడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.
undefined
click me!