షెఫాలీ వర్మ సెన్సేషనల్ ఇన్నింగ్స్... ఇంగ్లాండ్ రనౌట్... రెండో టీ20లో...

First Published Jul 12, 2021, 9:53 AM IST

ఐసీసీ టీ20 నెం.1 బ్యాట్స్‌వుమెన్ షెఫాలీ వర్మ, రెండో టీ20లో తన ఫామ్‌ను చూపించింది. మొదటి టీ20లో డకౌట్ అయిన షెఫాలీ వర్మ... రెండో టీ20 మ్యాచ్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్‌తో కమ్‌బ్యాక్ ఇచ్చింది. 

మొదటి టీ20లో డకౌట్ అయిన షెఫాలీ వర్మ... రెండో టీ20 మ్యాచ్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్‌తో కమ్‌బ్యాక్ ఇచ్చింది. షెఫాలీతో పాటు ఫామ్‌లో లేని హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఆకట్టుకోవడంతో రెండో టీ20లో భారత జట్టు 8 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది.
undefined
రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి, భారత జట్టుకి బ్యాటింగ్ అప్పగించింది ఇంగ్లాండ్. స్మృతి మందాన, షెఫాలీ వర్మ కలిసి తొలి వికెట్‌కి 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, టీమిండియాకి శుభారంభం అందించారు...
undefined
16 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేసిన స్మృతి మందాన అవుటైన తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేసి ఆకట్టుకుంది.
undefined
38 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 48 పరుగులు చేసిన షెఫాలీ వర్మ, ఒకే ఓవర్‌లో 5 ఫోర్లు బాది 20 పరుగులు రాబట్టింది. తొలి టీ20లో షెఫాలీని డకౌట్ చేసిన క్యాథరిన్ బ్రంట్ బౌలింగ్‌లోనే ఈ రేంజ్‌లో విరుచుకుపడింది టీనేజ్ సెన్సేషన్..
undefined
దీప్తి శర్మ 27 బంతుల్లో 24 పరుగులు చేయగా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది భారత వుమెన్స్ జట్టు...
undefined
149 పరుగుల లక్ష్యచేధనలో ఇంగ్లాండ్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ జట్టులో ఏకంగా నలుగురు బ్యాట్స్‌వుమెన్లు రనౌట్ కావడం విశేషం...
undefined
ఇంగ్లాండ్ బ్యాట్స్‌వుమెన్ టామీ బేమోంట్ 50 బంతుల్లో 7 ఫోర్లతో 59 పరుగులు చేయగా భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ రెండు వికెట్లు తీసింది...
undefined
click me!