350 కొట్టి అవుటయ్యా! చాలా బాధేసింది... అందుకే తర్వాతి మ్యాచ్‌లో 400 కొట్టి, కాలర్ ఎగరేశా.. - శుబ్‌మన్ గిల్

Published : Jun 20, 2023, 01:53 PM IST

అండర్19 వరల్డ్ కప్ 2018 గెలిచిన టీమ్‌కి వైస్ కెప్టెన్‌గా ఉన్న శుబ్‌మన్ గిల్, టీమిండియాకి త్రీ ఫార్మాట్ ప్లేయర్‌గా ప్లేస్ ఫిక్స్ చేసేసుకున్నట్టే. ఆ టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన పృథ్వీ షా, ఆడిలైడ్ టెస్టు పరాజయం తర్వాత పట్టించుకోని టీమిండియా... శుబ్‌మన్ గిల్‌కి మాత్రం వరుస అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తోంది..

PREV
18
350 కొట్టి అవుటయ్యా! చాలా బాధేసింది... అందుకే తర్వాతి మ్యాచ్‌లో 400 కొట్టి, కాలర్ ఎగరేశా.. - శుబ్‌మన్ గిల్
Image credit: PTI

2023 ఏడాదిలో ఇప్పటికే 8 అంతర్జాతీయ సెంచరీలు సాధించిన శుబ్‌మన్ గిల్, ఒకే ఏడాదిలో మూడు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన అరుదైన క్రికెటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన శుబ్‌మన్ గిల్, డబ్ల్యూటీసీ ఫైనల్‌లో మాత్రం ఫెయిల్ అయ్యాడు..

28

తొలి ఇన్నింగ్స్‌లో 13 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయిన శుబ్‌మన్ గిల్, రెండో ఇన్నింగ్స్‌లో థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి బలి అయ్యాడు. కామెరూన్ గ్రీన్ పట్టిన క్యాచ్ గురించి పెద్ద రచ్చే జరిగినా శుబ్‌మన్ గిల్ అలాంటి షాట్ ఆడడాన్ని ఎవ్వరూ తప్పు పట్టలేదు..

38
Virat Kohli-Shubman Gill

వెస్టిండీస్ టూర్‌కి ముందు హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న శుబ్‌మన్ గిల్, అండర్16 క్రికెట్ టోర్నీల్లో జరిగిన అనుభవాలను పంచుకున్నాడు. అండర్16 పంజాబ్ అంతర్ జిల్లా టోర్నీలో 7 మ్యాచుల్లో 1018 పరుగులు సాధించాడు శుబ్‌మన్ గిల్...

48

2014లో ఎమ్‌ మార్కన్ ట్రోఫీలో తొలి వికెట్‌కి 587 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పిన శుబ్‌మన్ గిల్, ఆ తర్వాతి ఏడాది మొహాలీ టీమ్‌కి ఓపెనర్‌గా, పంజాబ్ అండర్16 టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు..

58

అండర్16 విజయ్ మర్చంట్ ట్రోఫీ 2015లో ఐదు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలతో 1018 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, ఆ టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.  మొత్తంగా అండర్16 అంతర్ జిల్లా, అంతర్ రాష్ట్ర మ్యాచుల్లో 10కి పైగా సెంచరీలు సాధించాడు శుబ్‌మన్ గిల్.. 

68
Shubhman Gill

‘చిన్నప్పటి నుంచి నాకు అంత ఈజీగా సంతృప్తి దక్కేది కాదు. అండర్16 జిల్లా మ్యాచులు ఆడేటప్పుడు ఓ సారి 350 పరుగులు చేసి అవుట్ అయ్యా... చాలా నిరుత్సాహపడ్డాను. అందుకే ఆ తర్వాతి మ్యాచ్‌లో 400 కొట్టి, నాటౌట్‌గా నిలిచి కాలర్ ఎగరేశా..
 

78

400 కొట్టిన తర్వాత కూడా అవుటై ఉంటే ఫీల్ అయ్యేవాడిని. నాటౌట్‌గా నిలవడంతో కాస్త సంతృప్తి మిగిలింది. ఈ సెంచరీలు, డబుల్ సెంచరీలు చేసినా నా ఆకలి తీరదు. టెస్టుల్లో టీమిండియా తరుపున ఎవ్వరూ సాధించని రికార్డులు సాధించాలనేదే నా కల...’ అంటూ మనసులో కోరిక బయటపెట్టాడు శుబ్‌మన్ గిల్..
 

88

వెస్టిండీస్ టూర్‌లో రోహిత్ శర్మకు రెస్ట్ ఇచ్చి, శుబ్‌మన్ గిల్‌కి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే 23 ఏళ్ల శుబ్‌మన్ గిల్, అతి చిన్న వయసులో టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన భారత కెప్టెన్లలో ఒకడిగా నిలుస్తాడు.. 

Read more Photos on
click me!

Recommended Stories