వరల్డ్ క్రికెట్‌లో రోహిత్ టైగర్.. హిట్‌మ్యాన్‌పై ఆసీస్ దిగ్గజ పేసర్ ప్రశంసలు

Published : Jun 20, 2023, 01:26 PM IST

Rohit Sharma: టీమిండియా పేసర్  రోహిత్ శర్మపై  ఆసీస్ దిగ్గజ పేసర్ బ్రెట్ లీ   ప్రశంసలు కురిపించాడు. వరల్డ్ క్రికెట్ లో అతడు టైగర్ అని అన్నాడు. 

PREV
17
వరల్డ్ క్రికెట్‌లో రోహిత్ టైగర్.. హిట్‌మ్యాన్‌పై ఆసీస్ దిగ్గజ పేసర్  ప్రశంసలు

భారత క్రికెట్ జట్టు సారథి  రోహిత్ శర్మ ఇటీవల తన వ్యక్తిగత ప్రదర్శనతో పాటు  కెప్టెన్ గా టీమ్ పై తన ముద్ర వేయడం లేదన్నవారే ఎక్కువ.  భారీ టోర్నీలలో   అతడి ఆట తీరు నానాటికీ తీసికట్టుగా మారుతోంది. 

27

ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ (2022) తో పాటు కొద్దిరోజుల క్రితమే ముగిసిన  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో కూడా భారత జట్టు  దారుణ పరాజయాలు మూటగట్టుకున్న నేపథ్యంలో హిట్‌మ్యాన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్ లో అతడు జట్టును నడిపించిన తీరు, టీమ్ సెలక్షన్, అశ్విన్ ను తప్పించడం వంటివాటిపై ఇప్పటికీ అతడిపై  విమర్శలు వస్తూనే ఉన్నాయి. 

37

అయితే  వరుస విమర్శలతో ఉక్కిరిబిక్కిరవుతున్న రోహిత్ పై తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ బ్రెట్ లీ మాత్రం  ప్రశంసలు కురిపించాడు.  ఎవరెన్ని చెప్పినా రోహిత్ వరల్డ్ క్రికెట్ లో టైగర్ అని వ్యాఖ్యానించాడు.  బౌలర్లపై అతడు ఆధిపత్యం చెలాయించడాన్ని తాను ఆస్వాదిస్తానని  బ్రెట్ లీ చెప్పుకొచ్చాడు. 

47

లీ మాట్లాడుతూ.. ‘వరల్డ్ క్రికెట్ లో రోహిత్ శర్మ టైగర్. అందులో సందేహమే లేదు. షాట్ బాల్స్ ఆడటం, పుల్ షాట్స్ ఆడటంలో అతడిని మించినవారు లేరు. మరీ ముఖ్యంగా పవర్ ప్లే ఓవర్లలో  అతడు బౌలర్లను ఎదుర్కునే తీరు ముచ్చటేస్తుంది. 

57

ఆన్ ది ఫీల్డ్ లో బౌలర్లపై అంతగా విరుచుకుపడే రోహిత్.. ఆఫ్ ది ఫీల్డ్ లో మాత్రం కామ్ అండ్ రిలాక్స్డ్ గా ఉంటాడు. అతడు జెంటిల్‌మెన్..’అని  లీ చెప్పాడు.  

67

రోహిత్ పై ఆసీస్ మాజీ సారథి మైఖేల్ క్లార్క్ కూడా ప్రశంసలు కురిపించాడు. ఒక్క డబ్ల్యూటీసీ ఫైనల్ ఓడినంత మాత్రానా  అతడేమీ విఫలసారథి అయిపోడు అని అన్నాడు. ‘టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత రోహిత్ శర్మ, స్వదేశంలో ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ గెలిచాడు. బ్యాటర్‌గా కూడా బాగానే రాణించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టెస్టు సెంచరీ కూడా సాధించాడు.

 

77

ఒక్క ఫైనల్ ఓడినంత మాత్రం బ్యాడ్ కెప్టెన్ అయిపోడు, అలాగే ఒక్క మ్యాచ్ ఓడిపోయినంత మాత్రం టీమిండియా బ్యాడ్ టీమ్ అయిపోదు. వరుసగా రెండు సార్లు ఫైనల్స్‌ ఆడడం కూడా ఈజీ కాదు..’అని  క్లార్క్ తెలిపాడు. 

Read more Photos on
click me!

Recommended Stories