ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 ఓడిన తర్వాత వెస్టిండీస్ టూర్‌కి వెళ్లింది టీమిండియా. ఈ సిరీస్‌కి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్లను ఎంపిక చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. అయితే ఆ ఇద్దరూ లేకుండా వన్డే, టీ20 సిరీసుల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యింది నయా భారత్...
హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో రెండో వన్డేలో చిత్తుగా ఓడిన భారత జట్టు, మూడో వన్డే గెలిచి ఊపిరి పీల్చుకున్నా... టీ20 సిరీస్‌లో 3-2 తేడాతో పరాజయం పాలైంది. 2006 తర్వాత వెస్టిండీస్ చేతుల్లో ఎదురైన వైట్ బాల్ సిరీస్ పరాజయం ఇదే..
28
ఇషాన్ కిషన్, టీ20 సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్ కాగా శుబ్‌మన్ గిల్ నాలుగో టీ20లో యశస్వి జైస్వాల్‌తో కలిసి 165 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. హార్ధిక్ పాండ్యా, సంజూ శాంసన్‌తో పాటు అక్షర్ పటేల్, యజ్వేంద్ర చాహాల్ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యారు..
38
‘కొందరు ప్లేయర్లు ఫ్రాంఛైజీ లెవెల్లో బాగా ఆడతారు, అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చేసరికి అంచనాలు, ప్రెషర్ పెరిగిపోయి సరిగ్గా ఆడలేరు. అంతర్జాతీయ క్రికెట్‌లో బాగా ఆడాలంటే మైండ్‌సెట్ కూడా బాగుండాలి..
48
Hardik Pandya
అండర్19 క్రికెట్‌లో బాగా ఆడిన ప్లేయర్లు, ఒక్క అడుగు ముందుకు వేసి అంతర్జాతీయ క్రికెట్‌లోకి రాగానే ఎందుకని ఆ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నారు. బాయ్స్‌కి, మెన్స్‌కీ ఉన్న తేడా అదే. కుర్రాళ్లు, కుర్రాళ్లతో ఆడినప్పుడు బాగా ఆడతారు. కానీ మగాళ్లతో ఆడాలంటే వణికిపోతారు..
58
ఫ్రాంఛైజీ క్రికెట్, అంతర్జాతీయ క్రికెట్‌కి చాలా తేడా ఉంటుంది. మనవాళ్ల ప్రతాపం అంతా పిల్లలపైనే. ఐపీఎల్‌లో అదరగొట్టిన ప్లేయర్లు, అంతర్జాతీయ క్రికెట్‌లో ఎందుకని అలా ఆడలేకపోతున్నారు..
68
టీమ్‌లోని కొందరు ప్లేయర్లు, తమను తాము గొప్ప ప్లేయర్లుగా ఊహించుకుంటున్నారు. నమ్మకం ఉండడం మంచిదే కానీ అతి నమ్మకం అస్సలు మంచిది కాదు. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మొదటికే మోసం రావచ్చు. వెస్టిండీస్ టూర్‌లో పరాజయం అలాంటిదే..
78
అండర్19 స్థాయిలోనే స్కిల్ టెస్టు మరింత క్లిష్టంగా మార్చాలి. వెస్టిండీస్, వరల్డ్ కప్‌కి అర్హత సాధించలేకపోయింది. టాప్ టీమ్ టీమిండియాని ఓడించడం వాళ్లకు రెట్టింపు బలాన్ని ఇచ్చి ఉంటుంది.
88
అయితే ఆసియా కప్ 2023, వన్డే వరల్డ్ కప్ టోర్నీలకు ముందు ఇది మన టీమ్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత టీమ్ మేనేజ్‌మెంట్‌పైనే ఉంది..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్..