విడాకుల రూమర్స్‌కి చెక్! కలిసి టాక్ షో అనౌన్స్ చేసిన సానియా మీర్జా- షోయబ్ మాలిక్...

First Published | Nov 14, 2022, 3:26 PM IST

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోబోతున్నారని? లేదు, విడాకులు తీసేసుకున్నారని కొన్నాళ్లుగా మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. పాక్ మోడల్ అయేషా ఓమర్‌తో షోయబ్ మాలిక్ సీక్రెట్ రిలేషన్‌ గురించి సానియా మీర్జాకి తెలియడంతో ఈ ఇద్దరూ విడిపోవాలని డిసైడ్ చేసుకుంటున్నట్టు కథనాలు వినిపించాయి. ఎట్టకేలకు ఈ వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టేసింది సానియా- షోయబ్ మాలిక్ జోడి...

సానియా మీర్జా- షోయబ్ మాలిక్ కలిసి త్వరలో ఓ టీవీ టాక్ షో నిర్వహించబోతున్నారు. ‘ది మీర్జా మాలిక్ షో’ పేరుతో ఊర్దూఫ్లిక్స్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ప్రకటించింది. ఈ టాక్ షోకి పాపులారిటీ, క్రేజ్ తెచ్చేందుకు మీర్జా మాలిక్ విడాకులు తీసుకోబోతున్నారనే రూమర్‌కి పుట్టించినట్ట తెలుస్తోంది...

పాక్‌లో ఓ టీవీ షోలో పాల్గొన్న షోయబ్ మాలిక్, అక్కడ మోడల్‌తో సంబంధం ఏర్పరచుకున్నాడని... ఆ విషయం సానియా మీర్జాకి తెలియడంతో గొడవ జరిగి, అది విడాకుల దాకా వెళ్లిందని వార్తలు వచ్చాయి. సానియా మీర్జా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన కొన్ని పోస్టులు కూడా విడాకుల అనుమానాలకు తావిచ్చాయి.


‘అవును... సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకులు తీసేసుకున్నారు. సెపరేషన్స్‌కి సంబంధించిన పనులన్నీ ఇప్పటికే పూర్తియిపోయాయి...’ అంటూ మాలిక్ మేనేజర్ కామెంట్ చేశాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ రూమర్స్ అన్నీ ఈ టాక్ షోకి క్రేజ్ తెచ్చేందుకు చేసిన మార్కెటింగ్ ఎత్తుగడగా తేలింది... 

2010లో ప్రేమించి పెళ్లాడిన సానియా మీర్జా, షోయబ్ మాలిక్ దంపతులకు 2018లో ఇజాన్ మీర్జా అనే కొడుకు పుట్టాడు. బిడ్డ పుట్టిన తర్వాత ఏడాదిన్నర పాటు టెన్నిస్‌కి బ్రేక్ తీసుకున్న సానియా మీర్జా, కొడుకుతో కలిసి టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంది... 

Latest Videos

click me!