సచిన్ టెండూల్కర్, నన్ను ఓపెనర్‌గా రమ్మని అడిగాడు... - బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ...

First Published Apr 16, 2021, 5:09 PM IST

బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ... టీమిండియా తరుపున ఓపెనర్‌గా అద్భుతమైన రికార్డులో భాగస్వామిగా ఉన్నాడు. ప్రపంచంలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఓపెనింగ్ జోడిగా టాప్‌లో ఉన్నారు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ. అయితే తాను ఓపెనర్‌గా మారడానికి సచిన్ టెండూల్కరే కారణమంటున్నాడు సౌరవ్ గంగూలీ...

‘నేను, టీమిండియాలో వచ్చిన తర్వాత మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసేవాడిని. అప్పుడు సచిన్ టెండూల్కర్ నా దగ్గరికి వచ్చి, టెస్టుల్లో నువ్వు మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వస్తావు...
undefined
మన జట్టుకి సరైన ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ లేడు. నువ్వు ఓపెనర్‌గా ప్రయత్నించు...’ అని చెప్పాడు. నేను, సరేనని చెప్పా... అప్పటి నుంచిఓపెనర్‌గా మారాను...’ అంటూ చెప్పుకొచ్చాడు సౌరవ్ గంగూలీ.
undefined
2000వ సంవత్సరంలో టెండూల్కర్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా టూర్‌లో ఘోరంగా విఫలమైంది టీమిండియా. ఆ తర్వాత స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో సచిన్ టెండూల్కర్ నుంచి టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు సౌరవ్ గంగూలీ.
undefined
‘నాకు బాధ్యత ఇస్తే, నా వల్ల సాధ్యమైనది కచ్ఛితంగా చేసి చూపిస్తాను. కానీ కెప్టెన్సీ సరిగా వర్కవుట్ కావడం లేదు...’ అంటూ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు సచిన్ టెండూల్కర్...
undefined
టెండూల్కర్ తప్పుకోవడంతో ఎవరు కెప్టెన్ అవుతారనే విషయంలో మాకు ఎలాంటి క్లారిటీ లేదు. సచిన్, నేను ఒకే వయసు వాళ్లం... దాంతో సచిన్ టెండూల్కర్ తప్పుకున్న తర్వాత నాకు కెప్టెన్సీ ఇస్తారని ఎవ్వరూ ఊహించలేదు కూడా...
undefined
సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీని వదులుకోవడంతో నేను ఆ బాధ్యతలు తీసుకున్నాను... ’ అంటూ వివరణ ఇచ్చాడు భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ...
undefined
సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్ ఓపెనర్లుగా వచ్చిన మొదటి మ్యాచ్‌లోనే 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మొత్తంగా 136 మ్యాచుల్లో ఓపెనింగ్ చేసిన ఈ ఇద్దరు, 49.32 సగటుతో 6609 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
undefined
ఇందులో 21 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీ భాగస్వామ్యాలు కూడా ఉన్నాయి. వన్డేల్లో అత్యధిక విజయవంతమైన ఓపెనింగ్ జోడిగా రికార్డు క్రియేట్ చేశారు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ...
undefined
మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా 10 వన్డేలు ఆడిన సౌరవ్ గంగూలీ, 1996 టైటాన్ కప్ ట్రై సిరీస్‌లో ఓపెనర్‌గా మారాడు. మొత్తంగా 301 వన్డేలు ఆడిన సౌరవ్ గంగూలీ, 22 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలతో 11,363 వన్డే పరుగులు చేశాడు...
undefined
వీరేంద్ర సెహ్వాగ్ ఓపెనర్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్లీ మూడో నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా మారాడు సౌరవ్ గంగూలీ... గంగూలీ కెప్టెన్సీలో భారత జట్టు అద్భుత విజయాలు సాధించింది. 2003 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ చేరినా, టైటిల్ గెలవలేకపోయింది.
undefined
click me!