వాడు ఆడుతుంటే, దొంగచాటుగా దాచుకుని చూస్తా... సచిన్ టెండూల్కర్ కామెంట్స్...

Published : Feb 18, 2022, 02:55 PM IST

క్రికెట్‌లో వారసత్వాన్ని ద్వేషించే వారందరూ టార్గెట్ చేసేది సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్‌నే. సునీల్ గవార్కర్ కొడుకు రోహాన్ గవాస్కర్‌ నుంచి స్టువర్ట్ బిన్నీ వరకూ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన వారంతా పెద్దగా సక్సెస్ కాలేకపోయినా అర్జున్ టెండూల్కర్ తన వంతు ప్రయత్నాన్ని చేస్తూనే ఉన్నాడు...

PREV
110
వాడు ఆడుతుంటే, దొంగచాటుగా దాచుకుని చూస్తా... సచిన్ టెండూల్కర్ కామెంట్స్...

ఐపీఎల్ 2021సీజన్ వేలంలో ఆఖరిగా వేలానికి వచ్చిన అర్జున్ టెండూల్కర్‌ని ముంబై ఇండియన్స్‌ బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది...

210

ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలోనూ ఆఖరిగా వేలానికి వచ్చిన అర్జున్ టెండూల్కర్‌ కోసం ముంబై ఇండియన్స్ రూ.20 లక్షలకు కోట్ చేయగా, గుజరాత్ టైటాన్స్ బిడ్ వేసి మరో రూ.5 లక్షలు పెంచింది... 

310

గుజరాత్ టైటాన్స్ బిడ్‌ కారణంగా మరో 5 లక్షలు పెంచి ముంబై ఇండియన్స్, రూ.30 లక్షలకు అర్జున్ టెండూల్కర్‌ని కొనుగోలు చేసింది...

410

గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశీష్ నెహ్రా కారణంగా అదనంగా మరో రూ.10 లక్షలు అర్జున్ టెండూల్కర్ ఖాతాలో చేరాయి...

510

బ్యాటర్‌గా అనుకున్నంత సక్సెస్ రాకపోవడంతో పేస్ ఆల్‌రౌండర్‌గా ప్రయత్నిస్తున్న అర్జున్ టెండూల్కర్, ఇప్పటిదాకా ఒక్క ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడలేదు..

610

సచిన్ టెండూల్కర్ కారణంగా ముంబై ఇండియన్స్ అధినేతలు అంబానీ ఫ్యామిలీ, అర్జున్ టెండూల్కర్‌కి పాకెట్ మనీగా రూ.30 లక్షలు ఇస్తోందని సోషల్ మీడియాలో ట్రోల్స్ వినిపిస్తున్నాయి...

710

‘పిల్లల ఆటను చూడడానికి తల్లిదండ్రులు వస్తే, వాళ్లు తీవ్రమైన స్ట్రెస్‌కి గురవుతారు. అందుకే నేను ఎప్పుడూ అర్జున్ టెండూల్కర్ ఆటను నేరుగా చూడను...

810

వాడు నా కారణంగా స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు, ఫ్రీగా ఆడాలి. వాడి ఫోకస్‌ పూర్తిగా ఆటపైనే పెట్టాలని... అప్పుడప్పుడూ దాచుకుని ఓ మూల నుంచి మ్యాచులు చూస్తుంటాను...

910

నేను అక్కడే ఉన్నట్టు, వాడి ఆటను చూస్తున్నట్టు కూడా వాడికి తెలీదు. వాడికే కాదు, వాడి కోచ్‌కి కానీ అక్కడున్న ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడతా...’ అంటూ చెప్పుకొచ్చాడు సచిన్ టెండూల్కర్...

1010

ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కి నెట్ బౌలర్‌గా ఉండబోతున్న అర్జున్ టెండూల్కర్, రంజీ ట్రోఫీలోనూ ముంబై తరుపున ఆడబోతున్నాడు...

click me!

Recommended Stories