ఆయన అందరికంటే ఫిట్‌గా ఉండేవాడు... యష్‌పాల్ శర్మ మృతికి క్రీడా ప్రపంచం నివాళులు...

First Published Jul 13, 2021, 1:00 PM IST

మాజీ క్రికెటర్ యష్‌పాల్ శర్మ ఆకస్మిక మరణంతో క్రీడా ప్రపంచం ఒక్కసారిగా షాక్‌కి గురైంది. 1983 వన్డే వరల్డ్‌కప్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన వారిలో ఒకడైన యష్‌పాల్ శర్మ, చాలా ఫిట్‌గా ఉండేవారని మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ తెలిపారు..

‘ఇది నమ్మలేకపోతున్నా. ఆయన లేరంటే నమ్మడానికి కష్టంగా ఉంది. యష్‌పాల్‌నే గత వారమే కలిసాను. ఆయన చాలా ఫిట్‌గా ఉండేవాడు. తనకి ఫిట్‌నెస్ అంటే ప్రాణం... ఇంతలో ఇలా జరగడం షాకింగ్‌గా ఉంది...
undefined
గత వారం 1983 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన టీమ్ సభ్యులం అందరం కలిసాం. మా అందరిలో తనే చాలా ఫిట్‌గా కనిపించాడు. తన ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పమని కూడా అడిగాను. నేను వెజిటేరియన్‌ అని, ప్రతీరోజూ వాకింగ్ చేస్తానని చెప్పాను. ఇంతలోనే ఇలా జరిగిందంటే నమ్మడానికి కష్టంగా ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్...
undefined
మాజీ క్రికెటర్, మాజీ సెలక్టర్ యష్‌పాల్ శర్మ మృతిపై మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘యష్‌పాల్ శర్మ మరణవార్త దిగ్భాంతికి గురయ్యాను. మొట్టమొదటి వరల్డ్‌కప్ విజయాన్ని అందించిన హీరోల్లో ఆయన ఒకరు... వారి కుటుంబానికి, ’ అంటూ ట్వీట్ చేశాడు మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే...
undefined
‘యష్‌పాల్ శర్మ జీ మరణవార్త విని షాక్‌కి గురయ్యాను. 1983 వరల్డ్‌కప్‌లో ఆయన బ్యాటింగ్ చూస్తూ పెరిగాను. భారత క్రికెట్‌కి ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తిండిపోతాయి... ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా...’ అంటూ ట్వీట్ చేశాడు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్...
undefined
భారత మాజీ క్రికెటర్లు పార్థీవ్ పటేల్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్‌తో పాటు భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా యష్‌పాల్ శర్మ ఆకస్మిక మరణంపై స్పందిస్తూ, నివాళులు ఘటించారు...
undefined
1983 వన్డే వరల్డ్‌కప్‌లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా వ్యవహరించిన యష్‌పాల్ శర్మ, విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 120 బంతుల్లో 89 పరుగులు, ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో 115 బంతుల్లో 61 పరుగులు, ఆస్ట్రేలియా జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 40 బంతుల్లో 40 పరుగులు చేసి భారత జట్టు ఫైనల్ చేరడంలో కీ రోల్ పోషించారు...
undefined
click me!