మీకు లార్డ్స్ అయితే, మాకు ముంబై... లార్డ్స్‌లో చొక్కా విప్పిన తర్వాత సౌరవ్ గంగూలీ ఏం చెప్పాడు...

Published : Jul 13, 2021, 11:54 AM IST

భారత జట్టు 20వ శతకంలో సాధించిన చిరస్మరణీయ విజయాల్లో 2002 నాట్‌వెస్ట్ సిరీస్ ఒకటి. సరిగ్గా 19 ఏళ్ల క్రితం 2002, జూలై 13న జరిగిన నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్‌లో భారత జట్టు అద్భుతం విజయం సాధించింది. విజయం తర్వాత లార్డ్స్ బాల్కనీలో సౌరవ్ గంగూలీ చొక్కా విప్పి సెలబ్రేట్ చేసుకోవడం, ఇప్పటికీ ప్రతీ క్రికెట్ ఫ్యాన్స్‌కి మోస్ట్ మెమొరబుల్ మూమెంట్...

PREV
112
మీకు లార్డ్స్ అయితే, మాకు ముంబై...  లార్డ్స్‌లో చొక్కా విప్పిన తర్వాత సౌరవ్ గంగూలీ ఏం చెప్పాడు...

2002 ఫిబ్రవరిలో భారత్ పర్యటనకి వచ్చింది ఇంగ్లాండ్ జట్టు. ఈ పర్యటనలో ఇంగ్లాండ్, టీమిండియా మధ్య ఆరు వన్డేలు జరిగాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఆఖరి వన్డేలో 5 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్, వన్డే సిరీస్‌ను 3-3 తేడాతో డ్రా చేయగలిగింది...

212

ఈ మ్యాచ్‌లో ఆఖరి వికెట్‌గా వచ్చిన జవగల్ శ్రీనాథ్‌ను మొదటి బంతికే బౌల్డ్ చేసిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాప్... చొక్కా విప్పి సెలబ్రేట్ చేసుకున్నాడు..

312

ఆ సంఘటనను మనసులో పెట్టుకున్న సౌరవ్ గంగూలీ, దానికి బదులు తీర్చుకునేందుకు సరైన సమయం కోసం ఎదురుచూశాడు.

412

ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 5 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోరు చేసింది.

512

అప్పటి ఇంగ్లాండ్ కెప్టెన్ నాజర్ హుస్సేన్ 115 పరుగులు చేయగా ఓపెనర్ మర్కస్ ట్రెస్కోథిక్ 109 పరుగులు చేశాడు. లార్డ్స్ మైదానంలో 300+ స్కోరు ఛేదించడం అంటే అసాధ్యమనే చెప్పాలి. అప్పటిదాకా భారత జట్టు ఇక్కడ, ఇలాంటి టార్గెట్‌ను ఛేదించింది లేదు.  

612

ఓపెనర్లుగా వచ్చిన వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ కలిసి తొలి వికెట్‌కి 106 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గంగూలీ 43 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 60 పరుగులు చేయగా, సెహ్వాగ్ 49 బంతుల్లో 7 ఫోర్లతో 45 పరుగులు చేశాడు. 

712

వన్‌డౌన్‌లో వచ్చిన దినేశ్ మోంగియా 9, టూ డౌన్‌లో వచ్చిన సచిన్ టెండూల్కర్ 14, రాహుల్ ద్రావిడ్ 5 పరుగులు చేసి నిరాశపరిచారు. అయితే యువరాజ్ సింగ్, మహ్మద కైఫ్ కలిసి ఆరో వికెట్‌కి 121 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు...

812

అయితే విజయానికి 59 పరుగుల కావాల్సిన దశలో 63 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 69 పరుగులు చేసిన యువరాజ్ అవుట్ అయ్యాడు...

912

హర్భజన్ సింగ్ 15 పరుగులు చేసినా అనిల్ కుంబ్లే డకౌట్ కావడంతో 314 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోయింది టీమిండియా. అందరిలో ఒక్కటే టెన్షన్. భారత జట్టు విజయం దగ్గర బోల్తా పడుతుందేమోననే కంగారు. అయితే మహ్మద్ కైఫ్ 75 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 పరుగులు చేసి భారత జట్టుకి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

1012

49.3 ఓవర్‌లో విజయానికి కావాల్సిన పరుగు తీయగానే లార్డ్స్ బాల్కనీలో నుంచి మ్యాచ్ చూస్తున్న సౌరవ్ గంగూలీ చొక్కా విప్పి సెలబ్రేట్ చేసుకున్నాడు... ‘క్రికెట్ మక్కాలో చొక్కా విప్పడం మీకు ఎలా అనిపించింది’ అని మ్యాచ్ అనంతరం గంగూలీని ప్రశ్నించాడు ఇంటర్వ్యూ చేసే వ్యక్తి...

1112

దానికి గంగూలీ... ‘మీ ప్లేయర్ కూడా ముంబైలో చొక్కా విప్పాడు కదా?’ అని సమాధానం ఇచ్చాడు. ‘లార్డ్స్ క్రికెట్ మక్కా... అక్కడా, ఇక్కడా ఒక్కటేనా’ అని తిరిగి ప్రశ్నించాడు సదరు వ్యక్తి. దానికి సౌరవ్ గంగూలీ... ‘మీకు లార్డ్స్ క్రికెట్ మక్కా అయితే మాకు వాంఖడే మక్కా...’ అంటూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు...

1212

ఈ విజయం భారత జట్టు ఆలోచనను మార్చి వేసింది. ఏ దేశంలో అయినా, ఏ జట్టుపైనైనా విజయాలు సాధించగలమనే ధైర్యాన్ని, ప్లేయర్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. గంగూలీకి కెప్టెన్‌గా వరల్డ్ వైడ్ క్రేజ్‌ని తెచ్చిపెట్టింది...

click me!

Recommended Stories