సచిన్ టెండూల్కర్‌ వన్ మ్యాన్ ఆర్మీ! అతని అవుట్ చేయడానికి... అబ్దుల్ రజాక్ కామెంట్స్...

Published : Jun 17, 2023, 03:37 PM IST

కెరీర్ ఆరంభంలో సచిన్ టెండూల్కర్‌‌ని తన ముందు తరం క్రికెట్ స్టార్ సునీల్ గవాస్కర్‌తో పోల్చేవాళ్లు. ఆ తర్వాత తన తరం స్టార్లు రికీ పాంటింగ్, ఇంజమామ్ వుల్, సనత్ జయసూర్య, బ్రియాన్ లారాతో పోటీపడ్డాడు సచిన్ టెండూల్కర్...  

PREV
17
సచిన్ టెండూల్కర్‌ వన్ మ్యాన్ ఆర్మీ! అతని అవుట్ చేయడానికి... అబ్దుల్ రజాక్ కామెంట్స్...
Sachin Tendulkar

ఆ తర్వాతి తరంలో వచ్చిన విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, జో రూట్‌తో పాటు నేటి తరంలో శుబ్‌మన్ గిల్ దాకా.. అందరూ సచిన్ టెండూల్కర్‌ రికార్డులను టార్గెట్ చేసుకుంటూ వచ్చిన వాళ్లే... క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ ఓ ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసి రిటైర్ అయ్యాడు...

27
Sachin Tendulkar

ఆ మార్కును అందుకోవడానికి తరాలుగా క్రికెటర్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు, ఫెయిల్ అవుతూనే ఉన్నారు. భవిష్యత్తులో మళ్లీ ఓ సచిన్ టెండూల్కర్ పుడితే కానీ, ‘క్రికెట్ గాడ్’ క్రియేట్ చేసిన మార్కును అందుకునేలా కనిపించడం లేదు. తాజాగా సచిన్ టెండూల్కర్‌పై తనకున్న అభిమానాన్ని భయటపెట్టాడు పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్...

37
Sachin Tendulkar

‘సచిన్ టెండూల్కర్ ఎప్పటికీ వరల్డ్ క్లాస్ బ్యాటర్. ఆయనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అసాధారణం. అది నేటి తరానికి అర్థం కాదు. సచిన్ టెండూల్కర్, తాను ఎదుర్కొన్న క్లిష్టమైన బౌలర్‌గా నా పేరు చెప్పడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది...

47
sachin tendular

ఎందుకంటే గ్లెన్ మెక్‌గ్రాత్, వసీం అక్రమ్, వకార్ యూనిస్, ఆంబ్రోస్, మురళీధరన్, షేన్ వార్న్... ఇలా ఎందరో దిగ్గజ బౌలర్లు ఉన్నారు. వాళ్లలో ఎవరి పేరైనా చెప్పి ఉండొచ్చు.. ఆయన నా పేరు చెప్పాల్సిన అవసరం లేకపోయినా, చెప్పాడు. అది ఆయన గొప్పదనం..

57
Image credit: PTI

సచిన్ టెండూల్కర్ గొప్ప క్రికెటర్ మాత్రమే కాదు, అంతకుమించి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. నిజానికి నేను ఆయన్ని అంతగా ఇబ్బంది పెట్టినట్టు కూడా నాకు అనిపించలేదు. బంతి స్వింగ్ అయినప్పుడు ఎంత గొప్ప బ్యాటర్ అయినా ఇబ్బందిపడాల్సిందే...
 

67
Image credit: PTI

సచిన్ టెండూల్కర్, భారత టీమ్‌కి వన్ మ్యాన్ ఆర్మీ. టీమిండియాతో మ్యాచ్ ఆడిన ప్రతీసారీ, మా సీనియర్లు సచిన్ టికెట్ కావాలని కచ్ఛితంగా చెప్పేవాళ్లు. అందుకే మా టీమ్‌లో ప్రతీ బౌలర్, సచిన్‌నే టార్గెట్ చేసేవాళ్లం..

77
Abdul Razzaq

ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్‌లో అనుకుంటా, నేను సచిన్ టెండూల్కర్‌ని అవుట్ చేశాను. ఆ తర్వాత 2006లో కరాచీలో అవుట్ చేసినట్టున్నా.. నాకు తెలిసి అంతే, ఒకటి రెండు సార్లు అవుట్ చేసినా నా పేరు, సచిన్ టెండూల్కర్ నోటి నుంచి రావడం నాకు దక్కిన చాలా గొప్ప గుర్తింపుగా భావిస్తున్నా...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్.. 
 

click me!

Recommended Stories