ధోనీ, నన్ను కావాలనే పక్కనబెట్టేవాడు... రిటైర్మెంట్ తర్వాత హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు...

First Published Jan 1, 2022, 2:18 PM IST

టెస్టు క్రికెట్‌లో 400+ పైగా వికెట్లు తీసిన తర్వాత ధోనీ కెప్టెన్సీలోని టీమిండియాలో తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు హర్భజన్ సింగ్. రిటైర్మెంట్ తర్వాత వారం రోజులకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ధోనీ గురించి కొన్ని ఇంట్రెస్టింట్ వ్యాఖ్యలు చేశాడు హర్భజన్ సింగ్...

‘400+ వికెట్లు తీసిన ప్లేయర్‌ను ఎలా రిజర్వు బెంచ్‌లో కూర్చోబెడతారు? మాహీకి నాతో వచ్చిన ప్రాబ్లెమ్ ఏంటో ఇప్పటికీ నాకు అర్థం కాదు...

నన్ను టీమ్‌కి ఎంపిక చేయనప్పుడు చాలా సార్లు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దగ్గరికి వెళ్లి, కారణం ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నించాను...

అయితే ఎప్పుడూ కూడా ధోనీ నాకు సరిగా ఆన్సర్ ఇవ్వలేదు. అప్పుడే నాకు అర్థమైంది, నాకు సమాధానం చెప్పడం కూడా అతనికి ఇష్టం లేదని...

ఎన్నిసార్లు అడిగినా నన్ను ఎందుకు తప్పిస్తున్నారో చెప్పకపోయే సరికి, ఇక అడగడం కూడా మానేశా...  31 ఏళ్ల వయసులో నేను టెస్టుల్లో 400 వికెట్లకు పైగా తీశాను...

ఆ తర్వాత 8, 9 ఏళ్ల పాటు క్రికెట్‌లో కొనసాగగలనని నాకు తెలుసు. నాకు సరిగ్గా అవకాశాలు వచ్చి ఉంటే, ఈజీగా మరో 100, అంతకుమించి వికెట్లు తీసి ఉండేవాడిని... 

కానీ నాకు అవకాశాలు రాలేదు. నన్ను తుది జట్టుకి ఎంపిక చేయకుండా రిజర్వు బెంచ్‌లో కూర్చొబెట్టేవాళ్లు, ఆ తర్వాత కొన్నాళ్లకు ఎంపిక చేయడం కూడా మానేశారు...

ప్రతీ క్రికెటర్‌లానే నేను కూడా భారత జెర్సీలో రిటైర్మెంట్ తీసుకోవాలని కోరుకున్నా. ప్రతీ మ్యాచ్‌లోనూ నూరు శాతం కమిట్‌మెంట్‌తో ఆడాను...

అయినా నన్ను కావాలని పక్కనబెట్టారు. ఇప్పటికే నాతో మాహీకి వచ్చిన సమస్య ఏంటో అర్థం కాలేదు...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్...

103 టెస్టుల్లో 2,224 పరుగులతో 417 వికెట్లు తీసిన హర్భజన్ సింగ్, 236 వన్డేల్లో 269 వికెట్లు తశాడు. 28 టీ20 మ్యాచుల్లో 25 వికెట్లు తీశాడు...

2015లో చివరి టెస్టు, చివరి వన్డే ఆడిన హర్భజన్ సింగ్, 2016 టీ20 వరల్డ్‌ కప్‌లో యూఏఈతో మ్యాచ్ తర్వాత టీమిండియాలో చోటు కోల్పోయాడు...

click me!