RRvsKKR: రాజస్థాన్ వర్సెస్ కోల్‌కత్తా... నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

First Published Sep 30, 2020, 4:04 PM IST

IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు టేబుల్ టాపర్‌గా ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలబడుతోంది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. ‘అండర్‌ డాగ్స్’ బరిలో దిగిన రాజస్థాన్, ఇప్పటిదాకా జరిగిన రెండు మ్యాచుల్లోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. నేటి మ్యాచ్‌లో కీలకంగా మారనున్న స్టార్ ప్లేయర్లు వీరే...

సంజూ శాంసన్: కెరీర్‌లో బీభత్సమైన ఫామ్‌లో ఉన్నాడీ యంగ్ సెన్సేషన్. మొదటి రెండు మ్యాచుల్లో సంజూ శాంసన్ బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం. ఫోర్ల కంటే సిక్సర్లు ఎక్కువగా కొట్టే సంజూ శాంసన్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ బౌలర్లను ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.
undefined
శుబ్‌మన్ గిల్: హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో అందరి ప్రశంసలు అందుకున్నాడు శుబ్‌మన్ గిల్. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్‌గా భావిస్తున్న గిల్ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్‌లు మరిన్ని ఆశిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.
undefined
జోస్ బట్లర్: క్వారంటైన్ తర్వాత ఆడిన మొదటి మ్యాచ్‌లో విఫలమయ్యాడు జోస్ బట్లర్. అయితే బట్లర్ ఫామ్‌లోకి వస్తే విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో చెలరేగిపోతాడు. నేటి మ్యాచ్‌లో బట్లర్ నుంచి అలాంటి ఇన్నింగ్స్ ఆశిస్తోంది రాజస్థాన్.
undefined
దినేశ్ కార్తీక్: కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కెప్టెన్ గత మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. కెప్టెన్‌గా ముందుండి నడిపించాల్సిన దినేశ్ కార్తీక్ బాగా ఒత్తిడికి లోనవుతున్నాడు. కార్తీక్ నుంచి నేటి మ్యాచ్‌లో ఓ మెరుపు ఇన్నింగ్స్ వస్తే కేకేఆర్ జట్టులో నూతన ఉత్సాహం నిండుతుంది.
undefined
స్టీవ్ స్మిత్: కెప్టెన్ ఇన్నింగ్స్‌లు ఆడుతూ రాజస్థాన్ విజయంలో మంచి పాత్ర పోషిస్తున్నాడు స్మిత్. స్మిత్ నుంచి మరోసారి అలాంటి ఇన్నింగ్స్ తప్పకుండా ఆశించవచ్చు.
undefined
సునీల్ నరైన్: మొదటి రెండు మ్యాచుల్లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు నరైన్. అయితే సునీల్ నరైన్ ఫామ్ అందుకుంటే మాత్రం ప్రత్యర్థి జట్టుకి చుక్కలు చూపించేస్తాడు.
undefined
రాహుల్ త్రివాటియా: గత మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాది సెన్సేషన్ క్రియేట్ చేసిన రాహుల్ త్రివాటియాకి మంచి ఫాలోయింగ్ వచ్చింది. మొదట అందరూ తిట్టుకున్నా, తర్వాత వేయినోళ్ల పొడిగిన రాహుల్ త్రివాటియా మరోసారి బ్యాట్‌కి పని చెప్పేందుకు ట్రై చేస్తాడు..
undefined
నితీశ్ రాణా: భారీ సిక్సర్లు బాదుతూ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టేయగల హిట్టర్ నితీశ్ రాణా. అయితే గత రెండు మ్యాచుల్లో రాణా నుంచి ఆ రేంజ్ పర్ఫామెన్స్ అయితే రాలేదు.
undefined
రాబిన్ ఊతప్ప: టీ20 మ్యాచుల్లో సునామీ ఇన్నింగ్స్ ఆడగల ప్లేయర్లలో ఊతప్ప ఒకడు. అయితే ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఊతప్ప నుంచి సరైన ఇన్నింగ్స్ ఒక్కటి కూడా రాలేదు. అయితే ఊతప్ప ఇంతకుముందు కోల్‌కత్తాకి ఆడాడు కాబట్టి తన మాజీ జట్టుపై ఊతప్ప ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారనుంది.
undefined
ఇయాన్ మోర్గాన్: ఈ ఇంగ్లీష్ టీమ్ కెప్టెన్‌పై భారీ అంచనాలు పెట్టుకుంది కోల్‌కత్తా. గత మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పిన మోర్గాన్, ఓ భారీ ఇన్నింగ్స్ ఆడితే కేకేఆర్ విజయం సులువే.
undefined
జోఫ్రా ఆర్చర్: బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు ఆర్చర్. నేటి మ్యాచ్‌లో ఆర్చర్ కేకేఆర్ బ్యాట్స్‌మెన్ ఎలా ఇబ్బంది పెడతాడనేది కీలకం కానుంది.
undefined
ఆండ్రూ రస్సెల్: కొన్నాళ్లుగా సరైన ఇన్నింగ్స్ ఆడని పోలార్డ్, గత మ్యాచ్‌లో మెరుపులు మెరిపించాడు. ఇప్పుడు రస్సెల్ వంతు. పోలార్డ్ కంటే మంచి హిట్టర్ అయిన ఆండ్రే రస్సెల్ తన రేంజ్‌లో చెలరేగాల్సిన అవసరం చాలా ఉంది.
undefined
ప్యాట్ కమ్మిన్స్: మొదటి మ్యాచ్‌లో బౌలింగ్‌లో విఫలమైనా రెండో మ్యాచ్‌లో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు కమ్మిన్స్. కమ్మిన్స్ నుంచి ఆ రేంజ్ పర్ఫామెన్స్ రాజస్థాన్‌పై వస్తేనే, ఆర్ఆర్‌ బ్యాటింగ్ ఆర్డర్‌ను నిలువరించవచ్చు.
undefined
శివమ్ మావి: ఈ యంగ్ కేకేఆర్ బౌలర్ మంచి బౌలింగ్‌తో పరుగులను నియంత్రిస్తూ ఆకట్టుకుంటున్నాడు. నేటి మ్యాచ్‌లో మావి ప్రదర్శన కూడా కేకేఆర్‌కి కీలకం.
undefined
యశస్వి జైస్వాల్: మొదటి మ్యాచ్‌లో చోటు దక్కించుకున్న ఈ యంగ్ సెన్సేషన్‌కి రెండో మ్యాచ్‌లో చోటు దక్కలేదు. నేటి మ్యాచ్‌లో రియాన్ పరాగ్ బదులు యశస్వి జైస్వాల్‌కి అవకాశం రావచ్చు.
undefined
click me!