RR vs GT: 7 ఫోర్లు, 11 సిక్స‌ర్లతో ప‌రుగుల సునామీ.. 35 బంతుల్లో సెంచ‌రీ కొట్టిన వైభ‌వ్ సూర్య‌వంశీ

Published : Apr 28, 2025, 10:52 PM IST

Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2025లో అత్యంత వేగవంతమైన  హాఫ్ సెంచ‌రీ, ఆ త‌ర్వాత సెంచ‌రీ కొట్టాడు 14 ఏళ్ల బ్యాట్స్‌మన్ వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ చరిత్రలో సెంచరీ కొట్టిన అతి పిన్న వయస్కుడిగా వైభ‌వ్ రికార్డు సృష్టించాడు.  

PREV
15
RR vs GT: 7 ఫోర్లు, 11 సిక్స‌ర్లతో ప‌రుగుల సునామీ.. 35 బంతుల్లో సెంచ‌రీ కొట్టిన వైభ‌వ్ సూర్య‌వంశీ

Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2025లో 14 ఏళ్ల కుర్రాడు ప‌రుగుల సునామీ సృష్టించాడు. బౌల‌ర్ల‌ను దంచికొడుతూ బ్యాట్ తో విధ్వంసం రేపాడు. ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ కొట్టిన యంగెస్ట్ ప్లేయ‌ర్ గా రికార్డు సాధించాడు. అత‌నే రాజస్థాన్ యంగ్ ప్లేయ‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ. 

25
Vaibhav Suryavanshi

ఐపీఎల్ 2025 లో గుజరాత్ టైటాన్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కు అదిరిపోయే ఆరంభం ల‌భించింది. పవర్ ప్లే ముగిసేసరికి రాజస్థాన్ వికెట్ నష్టపోకుండా 87 పరుగులు చేసింది. 52 పరుగులతో వైభవ్ సూర్యవంశీ, 31 పరుగులతో యశస్వి జైస్వాల్ దుమ్మురేపారు. ఆ త‌ర్వాత కూడా  వైభ‌వ్ ప‌రుగుల సునామీ రేపుతూ సెంచ‌రీ కొట్టాడు. కేవ‌లం 35 బంతుల్లోనే సెంచ‌రీ సాధించాడు. ఐపీఎల్ హిస్ట‌రీలో రెండో ఫాస్టెస్ట్ సెంచ‌రీ ఇది.

35
Vaibhav Suryavanshi

ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ మొదటి నుంచీ గుజరాత్ బౌలర్లను ఉతికి ఆరేశారు. రెండో బంతికే సిక్సర్ బాదిన 14 ఏళ్ల వైభవ్ రాజస్థాన్ అభిమానులను ఉర్రూతలూగించాడు. మూడో ఓవర్లో మహమ్మద్ సిరాజ్ పై 3 బౌండరీలు బాదిన జైస్వాల్ స్కోరింగ్ వేగాన్ని పెంచాడు. తర్వాతి ఓవర్లో ఇషాంత్ శర్మ బౌలింగ్ ను దంచికొడుతూ మూడు సిక్సర్లు, రెండు బౌండరీలు బాది వైభవ్ మరింత ప్రమాదకరంగా మారాడు. ఆ ఓవర్లో 28 పరుగులు వచ్చాయి. 3.5 ఓవర్లలో జట్టు స్కోరు 50 దాటింది.

45
Vaibhav Suryavanshi (Photo- IPL)

5వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ ని కెప్టెన్ శుభ్ మాన్ గిల్ బౌలింగ్ కి పంపించాడు. కానీ, మొదటి బంతినే బౌండరీ బాదేసి సుందర్ ని స్వాగతించాడు. ఆ తర్వాత రెండు సిక్సర్లు, ఒక బౌండరీతో వైభవ్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 17 బంతుల్లో 3 బౌండరీలు, 6 సిక్సర్లతో వైభవ్ హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశాడు. వైభ‌వ్ సూర్య‌వంశీ త‌న సునామీ నాక్ తో ఐపీఎల్ లో హాఫ్ సెంచ‌రీ కొట్టిన యంగెస్ట్ ప్లేయ‌ర్ గా నిలిచాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2025లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ కొట్టిన ప్లేయ‌ర్ గా వైభ‌వ్ నిలిచాడు. 

55
Vaibhav Suryavanshi

తన సునామీ హాఫ్ సెంచరీ తర్వాత వైభవ్ సూర్యవంశీ మ‌రింత దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచ‌రీని సెంచ‌రీగా మార్చాడు. సిక్స‌ర్ల మో త మోగిస్తూ ప‌రుగుల వ‌ర్షం కురిపించాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో తన బ్యాట్ పవర్ చూపించాడు. కరీం జనత్ వేసిన 10 ఓవర్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 

 

కేవ‌లం 35 బంతుల్లో సెంచ‌రీ కొట్టాడు. త‌న 100 ప‌రుగుల ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 11 సిక్స‌ర్లు బాదాడు. ఐపీఎల్ లో సెంచ‌రీ కొట్టిన యంగెస్ట్ ప్లేయ‌ర్ వైభ‌వ్. అలాగే, టీ20 క్రికెట్ లో 14 ఏళ్ల 32 రోజుల వ‌య‌స్సులో సెంచ‌రీ కొట్టిన ప్లేయ‌ర్ గా నిలిచాడు. 

Read more Photos on
click me!

Recommended Stories