ఐపీఎల్ 2025 46వ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో టాస్ ఓడినా బ్యాటింగ్ చేసే అవకాశం దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ స్లోగా ఇన్నింగ్స్ ను కొనసాగించింది.
అభిషేక్ పొరెల్, ఫాఫ్ డుప్లెసిస్ మొదటి వికెట్‌కు 33 పరుగులు జోడించారు. పొరెల్ కేవలం 11 బంతుల్లో 2 బౌండరీలు, ఒక సిక్సర్‌తో 28 పరుగులు చేసి జోష్ హాజిల్‌వుడ్‌కు వికెట్ రూపంలో దొరికాడు. కరుణ్ నాయర్ పెద్ద ఇన్నింగ్స్ ను ఆడలేకపోయారు. 4 పరుగులకే పెవిలియన్ కు చేరాడు.
ఫాఫ్ డు ప్లెసిస్ 22 పరుగులు, కేఎల్ రాహుల్ రాహుల్ 41 పరుగులు చేశారు. చివరలో ట్రిస్టన్ స్టబ్స్ ధనాధన్ ఇన్నింగ్స్ తో 34 పరుగులు (18 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో) చేశాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ (15), అశుతోష్ శర్మ (2)లు బ్యాట్‌తో ప్రభావం చూపలేకపోయారు. భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. జోష్ హాజిల్‌వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు. యశ్ దయాల్, కృనాల్ పాండ్యా ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు. దీంతో 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిట్స్ 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.