అసలు సమస్య అతనితోనే... రోహిత్ శర్మ ఫామ్‌పై సునీల్ గవాస్కర్ హాట్ కామెంట్స్...

First Published | Oct 26, 2022, 1:22 PM IST

పాకిస్తాన్‌ని ఓడించి, టీ20 వరల్డ్ కప్‌ 2022లో తొలి విజయాన్ని అందుకుంది టీమిండియా. గత ఎడిషన్‌తో పోలిస్తే ఈసారి టీమ్‌లో జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా వంటి సీనియర్లు లేకపోయినా భారత బౌలర్లు, అంచనాలకు మించి రాణించారు. అయితే బ్యాటింగ్‌లో మాత్రం టాపార్డర్ వైఫల్యం టీమిండియాని దెబ్బ తీసింది...

కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్... మరోసారి కీలక మ్యాచుల్లో చేతులు ఎత్తేశారు. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాక్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి కారణమైన ఈ  ముగ్గురి ఫెయిల్యూర్ పర్ఫామెన్స్, ఆస్ట్రేలియాలోనూ మొదటి మ్యాచ్‌లో కొనసాగింది...
 

ద్వైపాక్షిక సిరీసుల్లో దుమ్మురేపే పర్ఫామెన్స్‌తో ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన టీ20 బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన సూర్యకుమార్ యాదవ్‌, తొలి మ్యాచ్‌లో స్వల్ప స్కోరుకే అవుట్ కాగా రోహిత్ శర్మ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు...


Image credit: Getty

‘రోహిత్ శర్మ ఎలాంటి బ్యాటర్, ఎంతటి విధ్వంసకర బ్యాటర్ అనేది అందరికీ తెలుసు. అతను సెట్ అయితే వరల్డ్‌లో మోస్ట్ డేంజరస్ బ్యాటర్‌. రోహిత్ బ్యాటింగ్ చేస్తుంటే షాట్స్ కొట్టడం ఇంత తేలిక అన్నట్టు ఉంటుంది...

ఏ టీమ్‌కి అయినా ఆరంభం బాగుండాలి. ఫ్లాట్‌ఫామ్ కరెక్టుగా దొరికితే ఎంత భారీ స్కోరు అయినా చేయొచ్చు. ఓపెనర్లు రాణిస్తే తర్వాత వచ్చే బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది.. అందుకే రోహిత్ శర్మ టైమ్ తీసుకున్నా పర్లేదు... సెటిల్ అవ్వాలి...

Image credit: PTI

వేగంగా ఆడబోయి 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోవడం కంటే స్లోగా ఆడి 4 ఓవర్లలో 40 పరుగులకు ఒక్క వికెట్ కోల్పోతే బాగుంటుంది కదా... కెప్టెన్సీ తీసుకున్న తర్వాత రోహిత్ శర్మ ప్రెషర్ ఫీల్ అవుతున్నాడు. అది అతని బ్యాటింగ్‌లో కనబడుతోంది...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...

Latest Videos

click me!