ఇంకా ముంబైలోనే రోహిత్ శర్మ... బంగ్లాతో రెండో టెస్టు ఆడకపోవడమే బెటర్ అంటున్న ఫ్యాన్స్...

First Published Dec 19, 2022, 11:47 AM IST

గాయం కారణంగా రెండో వన్డే తర్వాత టీమ్‌కి దూరమైన రోహిత్ శర్మ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. డిసెంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టులో రోహిత్ శర్మ ఆడతాడని ప్రచారం జరిగింది. అయితే రోహిత్ ఇప్పటిదాకా ముంబైలోనే ఉండడం విశేషం...

కెప్టెన్ రోహిత్ శర్మ ఆడిన మ్యాచుల్లో కంటే రెస్ట్ తీసుకున్న మ్యాచుల్లోనే టీమిండియా బెటర్ పర్ఫామెన్స్ ఇస్తూ వస్తోంది. ఆసియా కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్, శ్రీలంక చేతుల్లో చిత్తుగా ఓడిన తర్వాత ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌కి దూరంగా ఉన్నాడు రోహిత్ శర్మ...

ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కెరీర్‌లో మొట్టమొదటి టీ20 సాధించాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ పర్యటనలో రోహిత్ శర్మ ఆడిన మొదటి రెండు వన్డేల్లోనూ టీమిండియా చిత్తుగా ఓడింది. రోహిత్ శర్మ గాయం కారణంగా తప్పుకున్న మూడో వన్డేలో ఇషాన్ కిషన్ డబుల్, విరాట్ కోహ్లీ సెంచరీలు చేసుకుని టీమిండియాకి ఘన విజయం అందించారు...

రోహిత్ శర్మ దూరం కావడంతో అతని ప్లేస్‌లో తొలి టెస్టు ఆడాడు శుబ్‌మన్ గిల్. తొలి ఇన్నింగ్స్‌లో ఫెయిల్ అయినా రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగాడు శుబ్‌మన్ గిల్. మరో వైపు నాలుగేళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోయిన పూజారా, కెరీర్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదేశాడు..

Rohit Sharma

దీంతో చాలామంది టీమిండియా ఫ్యాన్స్, రెండో టెస్టులో కూడా రోహిత్ శర్మ ఆడకపోవడమే బెటర్ అని కామెంట్లు చేస్తున్నారు. విరాట్ కోహ్లీ చేసిన గత రెండు సెంచరీలు కూడా కెఎల్ రాహుల్ కెప్టెన్సీలోనే వచ్చాయి. 

Image credit: Getty

మూడేళ్లుగా టెస్టుల్లో సెంచరీ చేయలేకపోయిన విరాట్ కోహ్లీ, రెండో టెస్టులో ఆ మార్కు అందుకోవాలని గట్టిగా కోరుకుంటున్నారు అభిమానులు. కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో అయితే కోహ్లీ స్వేచ్ఛగా ఆడి మరో సెంచరీ చేస్తాడనేది కోహ్లీ ఫ్యాన్స్ నమ్మకం...

‘రోహిత్ శర్మ పూర్తిగా కోలుకున్నా, ఇంట్లోనే ఉంటే బెటర్. ఎందుకంటే చేతి వేలికి గాయమైనప్పుడు కొన్నిరోజులు క్రికెట్‌కి దూరంగా ఉండడమే బెటర్. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా, వెంటనే మళ్లీ బ్యాటు పట్టుకుని ఆడడం మంచిది కాదు..

ఇలాంటి చిన్నచిన్న గాయాలే పెద్ద డ్యామేజీ చేస్తాయి. అందుకే నా ఉద్దేశంలో రోహిత్ మరో 10-15 రోజులు రెస్ట్ తీసుకుంటే బెటర్. అయితే బంగ్లాదేశ్‌ టూర్‌లో టీమిండియా తొలి టెస్టు గెలిచింది. టీమ్ కాంబినేషన్ సెట్ అయ్యింది. ఇప్పుడు రోహిత్ వచ్చి దాన్ని చెడగొట్టకపోవడమే మంచిది...’ అంటూ వ్యాఖ్యానించాడు టీమిండియా మాజీ కెప్టెన్ అజయ్ జడేజా.. 

click me!