Mumbai Indians: హార్దిక్ పాండ్యా ఔట్ ! ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ ఎవరు?

Published : Nov 01, 2026, 11:41 AM IST

Mumbai Indians: ఐపీఎల్ 2027 ముందు ముంబై టీమ్ అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేసిన తర్వాత ముంబై జట్టు పరిస్థితి దారుణంగా మారింది. దీంతో పాండ్యాను పక్కనబెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

PREV
15
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఔట్

ఐపీఎల్ అభిమానులకు ఒక మైండ్ బ్లాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ మళ్ళీ తమ పాత కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వైపు చూస్తోంది. రాబోయే ఐపీఎల్ 2027 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టడానికి దాదాపు ఖరారైనట్లు సమాచారం. గత మూడు సీజన్లుగా కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యాను తప్పించి, రోహిత్‌కు మళ్ళీ బాధ్యతలు అప్పగించేందుకు ఫ్రాంచైజీ యజమాన్యం సిద్ధమైంది.

25
ఇప్పటికే రోహిత్ శర్మతో చర్చలు

పలు మీడియా రిపోర్టుల ప్రకారం.. ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్‌మెంట్ రోహిత్ శర్మతో పలు విడతల చర్చలు జరిపింది. ఫ్రాంచైజీ విన్నపం మేరకు రోహిత్ శర్మ మళ్ళీ కెప్టెన్సీ స్వీకరించడానికి అంగీకారం తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు రోహిత్‌ను తప్పించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇచ్చారు. అయితే, 2027 సీజన్ నాటికి ఈ నిర్ణయానికి ఎండ్ కార్డ్ పడనుంది. రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుని లీగ్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచిన సంగతి తెలిసిందే.

35
హార్దిక్ పాండ్యా ఫ్యూచర్ ఏంటి?

రోహిత్ శర్మ రీఎంట్రీ వార్తలతో హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది. గుజరాత్ టైటాన్స్ నుంచి రోహిత్ స్థానంలో ముంబైకి వచ్చిన హార్దిక్, కెప్టెన్‌గా మొదటి సీజన్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. ఆ సీజన్‌లో ముంబై 14 మ్యాచుల్లో కేవలం 4 మాత్రమే గెలిచి 9వ స్థానంలో నిలిచింది. ఒకవేళ ఐపీఎల్ 2027 ట్రేడ్ విండోలో వేరే జట్టుకు మారకపోతే, హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ కెప్టెన్సీ కింద ఒక సాధారణ ప్లేయర్‌గా ఆడేందుకు సమ్మతించినట్లు తెలుస్తోంది.

45
కెప్టెన్సీ రేసులో వినిపించిన పేర్లు ఇవే

నిజానికి ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ గత సీజన్ పూర్తికాక ముందే నాయకత్వ మార్పుపై తీవ్రంగా ఆలోచించింది. రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ పేర్లను కూడా కెప్టెన్సీ రేసులో పరిశీలించారు. చర్చల సమయంలో రోహిత్ శర్మ స్వయంగా యంగ్ ప్లేయర్ తిలక్ వర్మ పేరును తదుపరి కెప్టెన్‌గా ప్రతిపాదించాడు. కానీ, జట్టుకు స్థిరత్వం కావాలని భావించిన ముంబై యజమాన్యం మళ్ళీ అనుభవజ్ఞుడైన రోహిత్ శర్మను ఒప్పించి సక్సెస్ అయిందని సమాచారం.

55
కోచింగ్ స్టాఫ్ ఎంపికలోనూ రోహిత్ మార్క్

కేవలం ప్లేయర్‌గానే కాకుండా జట్టు భవిష్యత్తు ప్రణాళికల్లో కూడా రోహిత్ శర్మ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ముంబై ఇండియన్స్ కొత్త కోచింగ్ స్టాఫ్ నియామకాల్లో కూడా రోహిత్ తన అభిప్రాయాలను పంచుకున్నట్లు సమాచారం. 2013, 2015, 2017, 2019, 2020లలో ముంబైని విజేతగా నిలిపిన రోహిత్ శర్మ, మళ్ళీ కెప్టెన్ అవ్వడం అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేసింది. 2027 సీజన్ నాటికి ఈ ఇద్దరి సీనియర్ ప్లేయర్ల కాంబినేషన్ ఎలా ఉండబోతోందో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories