ICC Women T20 World Cup 2026 : మహిళల టీ20 ప్రపంచకప్ ప్రారంభం అయ్యింది. అయితే ఈ మెగా టోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకు ఎంత ప్రైజ్ మనీ లభిస్తుంది? ఓడిన జట్లకు ఎంత మొత్తం ఇస్తారో వివరంగా చూద్దాం.
ఐసిసి ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఈసారి జట్ల సంఖ్య పెరిగింది… గతంలో 10 జట్లు పాల్గొంటే ఈసారి 12 జట్లు తలపడనున్నాయి. మొత్తం 24 రోజుల పాటు 7 స్టేడియంలలో 33 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ ఏడాది మహిళల ప్రపంచకప్ కోసం ఐసీసీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ప్రైజ్ మనీని పెంచింది.
23
ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ప్రైజ్ మనీ ఎంత..?
2026 మహిళల టీ20 ప్రపంచకప్ కోసం ఐసీసీ మొత్తం 8.76 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 73.18 కోట్లు) ప్రైజ్ మనీని కేటాయించింది. ఇది 2024లో యూఏఈలో జరిగిన ప్రపంచకప్ ప్రైజ్ మనీ కంటే 10% ఎక్కువ. ఈ టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచిన జట్టుకు చరిత్రలోనే అత్యధికంగా 23,40,000 అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 19.55 కోట్లు) బహుమతిగా లభిస్తాయి.
33
ఐసిసి టీ20 వరల్డ్ కప్ లో ఓడిన జట్లకూ కోట్లు...
ఐసిసి వరల్డ్ కప్ 2026 లో అద్భుతంగా ఆడి ఫైనల్‌కు చేరితే చాలు… చివరి మ్యాచ్ లో ఓడిపోయి రన్నరప్ గా నిలిచే జట్టుకు 11,70,000 డాలర్లు (సుమారు రూ. 9.77 కోట్లు) అందుతాయి. సెమీఫైనల్‌లో ఓడిన రెండు జట్లకు తలా 6,75,000 డాలర్లు (సుమారు రూ. 5.64 కోట్లు) ఇస్తారు. లీగ్ దశలో గెలిచిన ప్రతి మ్యాచ్‌కు ఐసీసీ బోనస్‌గా 31,154 డాలర్లు (సుమారు రూ. 26 లక్షలు) అందిస్తుంది. టోర్నీలో పాల్గొన్న 12 జట్లు లీగ్ దశలోనే నిష్క్రమించినా, కనీస ప్రోత్సాహకంగా ఒక్కో జట్టుకు 2,47,500 డాలర్లు (సుమారు రూ. 2.06 కోట్లు) అందజేయడం విశేషం.