అదంతా చెత్త వాగుడు! డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరిగిందో రవిశాస్త్రికేం తెలుసు... రోహిత్ శర్మ కామెంట్స్...

Published : Mar 09, 2023, 10:10 AM IST

రోహిత్ శర్మ టీమిండియా ఫుల్ టైం కెప్టెన్‌ కాకముందే హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు రవిశాస్త్రి. విరాట్ కోహ్లీ మ్యారేజ్ టైం‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆసియా కప్ గెలిచిన భారత జట్టుకి హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు శాస్త్రి. అయితే ఈ ఇద్దరి మధ్య రిలేషన్ సరిగ్గా లేనట్టు తెలుస్తోంది...  

PREV
16
అదంతా చెత్త వాగుడు! డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరిగిందో రవిశాస్త్రికేం తెలుసు... రోహిత్ శర్మ కామెంట్స్...

తొలి రెండు టెస్టుల్లో గెలిచిన టీమిండియా, మూడో టెస్టులో చిత్తుగా ఓడింది. తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా, రెండో ఇన్నింగ్స్‌లో 200 మార్కుని టచ్ చేయలేకపోయింది. ఈ మ్యాచ్ రిజల్ట్‌పై టీమిండియా మాజీ హెడ్ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి...

26
Rohit Sharma- Ravi Shastri

‘తొలి రెండు టెస్టుల్లో ఈజీగా గెలిచేసరికి టీమిండియాకి కాన్ఫిడెన్స్ పెరిగిపోయినట్టుంది. ఎలాగైనా గెలిచేస్తామనే ఓవర్ కాన్ఫిడెన్స్ వారిలో కనబడుతోంది. ఆధిక్యం చూపించాలనే ఆతృత కారణంగా మూడో టెస్టు ఓడిపోయారు. విజయాన్ని తలకెక్కించుకుంటే ఇలాగే ఉంటుంది...’ అంటూ వ్యాఖ్యానించాడు రవిశాస్త్రి..

36

ఈ వ్యాఖ్యలపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ‘రవిశాస్త్రి ఇలాంటి కామెంట్లు చేస్తాడని నేను ఊహించలేదు. ఆయన కూడా భారత డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నారు. టీమిండియా ప్లేయర్లలో ఎలాంటి మైండ్‌సెట్ ఉంటుందో ఆయనకి బాగా తెలుసు...

46
Image credit: Getty

ప్రతీ మ్యాచ్‌కి ముందు ప్రెష్‌గా మొదలెడతాం. ముందు మ్యాచుల గురించి ఆలోచించకుండా కొత్తగా మొదలెడతాం. కాస్త నిర్లక్ష్యంగా ఉన్నాం, కానీ ఎప్పుడూ ఓవర్ కాన్ఫిడెంట్‌గా లేం. నిజం చెప్పాలంటే మొదటి రెండు మ్యాచులు గెలిచిన తర్వాత ఓడిపోతే, బయటి వ్యక్తులకు ఓవర్ కాన్ఫిడెంట్‌గానే కనిపిస్తాం..
 

56
Image credit: PTI

అయితే మేం ఎప్పుడూ విజయాన్ని తలకు ఎక్కించుకోలేదు. అదంతా చెత్త వాగుడు. బయటి వ్యక్తులకు టీమ్‌లో ఏం జరుగుతుందో తెలీదు. నాలుగు టెస్టుల్లో నూటికి నూరు శాతం ఇవ్వడమే మా కర్తవ్యం...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ...
 

66
Image credit: PTI

కెప్టెన్‌గా మొదటి నాలుగు టెస్టుల్లో గెలిచిన రోహిత్ శర్మ, ఇప్పటిదాకా విదేశాల్లో టెస్టుకి కెప్టెన్సీ చేయలేదు. నాలుగో టెస్టులో టీమిండియా గెలిస్తే, నేరుగా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధిస్తుంది. ఆస్ట్రేలియాతో ఇంగ్లాండ్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్, రోహిత్‌కి కెప్టెన్‌గా తొలి ఫారిన్ టెస్టు కానుంది..

Read more Photos on
click me!

Recommended Stories