పాక్‌పై ప్రతాపం చూపని రోహిత్ శర్మ... 15 ఏళ్లుగా ఒక్క హాఫ్ సెంచరీ కొట్టని హిట్ మ్యాన్...

Published : Sep 04, 2022, 04:53 PM IST

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు టీ20ల్లో రికార్డు స్థాయిలో నాలుగు అంతర్జాతీయ సెంచరీలు, 3499 పరుగులు ఉన్నాయి. అయితే దాయాది పాకిస్తాన్‌పై రోహిత్ శర్మకు మెరుగైన రికార్డు లేదు. ఇప్పటిదాకా రోహిత్ శర్మ, పాక్‌పై ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయకపోవడం, టీమిండియా ఫ్యాన్స్‌ని కలవరబెడుతోంది...

PREV
16
పాక్‌పై ప్రతాపం చూపని రోహిత్ శర్మ... 15 ఏళ్లుగా ఒక్క హాఫ్ సెంచరీ కొట్టని హిట్ మ్యాన్...
rohit sharma

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ఇన్నింగ్స్ మొదటి బంతికే గోల్డెన్ డకౌట్ అయిన రోహిత్ శర్మ, ఆసియా కప్ 2022 టోర్నీలో జరిగిన మొదటి మ్యాచ్‌లో 18 బంతులు ఆడి ఓ సిక్సర్‌తో 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు... 

26
Rohit Sharma

ఓవరాల్‌గా పాకిస్తాన్‌పై 9 టీ20 మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ, 8 ఇన్నింగ్స్‌ల్లో 82 పరుగులు మాత్రమే చేశాడు. పాక్‌పై రోహిత్ శర్మ టీ20 సగటు 13.66 మాత్రమే. స్ట్రైయిక్ రేటు 112.32గా ఉంది... అత్యధిక స్కోరు 30 పరుగులు మాత్రమే...

36
Image credit: Getty

2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలబడ్డాయి. అదే ఏడాది అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన రోహిత్ శర్మ, ఫైనల్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి 16 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పటిదాకా పాక్‌పై రోహిత్ శర్మకు ఇదే అత్యధిక స్కోరు...
 

46

వన్డేల్లో పాకిస్తాన్‌పై రోహిత్‌ శర్మకు ఘనమైన రికార్డు ఉంది. 17 వన్డే మ్యాచుల్లో 48.66 సగటుతో 730 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. ఇందులో 2 సెంచరీలు కూడా ఉన్నాయి. 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 113 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 140 పరుగులు చేసి అత్యధిక స్కోరు నమోదు చేశాడు రోహిత్ శర్మ.. 

56

15 ఏళ్ల క్రితం జరిగిన ఈ మ్యాచ్ తర్వాత భారత్, పాకిస్తాన్ జట్లు టీ20ల్లో 7 సార్లు తలబడ్డాయి. అయితే రోహిత్ శర్మ బ్యాటు నుంచి ఎప్పుడూ సరైన ఇన్నింగ్స్ మాత్రం రాలేదు. ఈసారైనా రోహిత్ శర్మ ఈ గణాంకాలను సరి చేస్తాడా? అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు...

66
Image credit: Getty

సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. విరాట్ కోహ్లీకి పాకిస్తాన్‌పై మంచి రికార్డు ఉంది. అయితే రోహిత్ శర్మ తన రేంజ్ ఇన్నింగ్స్ ఒక్కటి ఆడితే టీమిండియా వేరే లెవెల్‌లో పాకిస్తాన్‌పై డామినేట్ చేయగలుగుతుంది. అందుకే పాక్‌పై హిట్ మ్యాన్ షో చూపించాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్...

Read more Photos on
click me!

Recommended Stories