రోహిత్ శర్మ ఒక్కడే మిగిలాడు... రాబిన్ ఊతప్ప, దినేశ్ కార్తీక్, పియూష్ చావ్లా, శ్రీశాంత్‌లతో పాటు...

First Published Dec 25, 2021, 11:45 AM IST

ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో అండర్‌డాగ్స్‌గా బరిలో దిగి 2007 టీ20 వరల్డ్‌కప్ గెలిచింది భారత జట్టు. 2007లో మొట్టమొదటి పొట్టి ప్రపంచకప్ ఆడిన జట్టులో రోహిత్ శర్మ ఒక్కడే, టీమిండియాలో మిగిలిన ప్లేయర్‌గా ఉన్నాడు...

2007 వన్డే వరల్డ్‌కప్‌లో ఘోర పరాభవం తర్వాత సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్, జహీర్ ఖాన్ వంటి సీనియర్లు... టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి దూరంగా ఉన్నారు...

దీంతో యువకులతో నిండిన జట్టుతో బరిలో దిగి, టీ20 వరల్డ్‌ కప్ 2007 టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించింది ధోనీ సేన. హర్భజన్ సింగ్ రిటైర్మెంట్‌తో 2007 టీ20 వరల్డ్‌ కప్ ఆడిన జట్టులో ఐదుగురు మాత్రమే ఇంకా క్రికెట్‌లో కొనసాగుతున్నవారిగా ఉన్నారు...

రోహిత్ శర్మతో పాటు రాబిన్ ఊతప్ప, దినేశ్ కార్తీక్, పియూష్ చావ్లా, శ్రీశాంత్... 2007 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఆడి ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించని క్రికెటర్లుగా ఉన్నారు...

వీరిలో రోహిత్ శర్మ మాత్రమే టీమిండియా తరుపున బరిలో దిగుతున్నాడు. 14 ఏళ్ల తర్వాత టీమిండియా కెప్టెన్సీ దక్కించుకున్న రోహిత్, వైట్ బాల్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే...

ఎమ్మెస్ ధోనీ కంటే ముందుగానే జట్టులోకి వచ్చిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్. టీమిండియా తరుపున 94 వన్డేలు, 32 టీ20, 26 టెస్టులు ఆడిన దినేశ్ కార్తీక్, చివరిగా 2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో ఆడాడు...

టీమిండియా తరుపున 46 వన్డేలు, 13 టీ20 మ్యాచులు ఆడిన రాబిన్ ఊతప్ప, 2015లో జింబాబ్వేపై ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు...

టీమిండియా తరుపున 3 టెస్టులు, 25 వన్డేలు ఆడిన పియూష్ చావ్లా... 2007 టీ20 వరల్డ్‌కప్ టోర్నీతో పాటు 2011 వన్డే వరల్డ్‌కప్ ఆడిన జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. అయితే ఈ రెండు టోర్నీల్లోనూ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు చావ్లా. చివరిగా 2012లో ఇంగ్లాండ్‌పై ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు చావ్లా... 

కెరీర్ పీక్ స్టేజీలో ఉన్న సమయంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో జట్టుకి దూరమయ్యాడు ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్. టీమిండియా తరుపున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20 మ్యాచులు ఆడిన శ్రీశాంత్, చివరిగా 2011లో టీమిండియా తరుపున మ్యాచ్ ఆడాడు. 

హర్భజన్ సింగ్ రిటైర్మెంట్‌తో 2003 వన్డే వరల్డ్‌కప్ ఆడిన భారత జట్టులో ప్లేయర్లు అందరూ రిటైర్మెంట్ తీసుకున్నట్టైంది. మహ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్, పార్థివ్ పటేల్ కంటే పెద్దవాడైన హర్భజన్ సింగ్, వీరి తర్వాత క్రికెట్ నుంచి తప్పుకోవడం విశేషం. 

click me!