రోహిత్ టీమ్‌తో ఆడాలంటే భయపడేవాడిని, కెప్టెన్‌గా... గౌతమ్ గంభీర్ హాట్ కామెంట్స్..

Published : Mar 10, 2022, 09:39 AM IST

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ కెరీర్ గ్రాఫ్‌ని మార్చిన నాయకుడు రోహిత్ శర్మ అయితే, కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి రెండు టైటిల్స్ అందించిన సారథి గౌతమ్ గంభీర్. ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌పుల్ కెప్టెన్లలో ఒకడైన గంభీర్, రోహిత్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు...

PREV
19
రోహిత్ టీమ్‌తో ఆడాలంటే భయపడేవాడిని, కెప్టెన్‌గా... గౌతమ్ గంభీర్ హాట్ కామెంట్స్..

ఐపీఎల్ కెరీర్‌లో కేకేఆర్‌పై అత్యధిక విజయాలు అందుకున్న జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి. ఇప్పటిదాకా ఈ రెండు జట్ల మధ్య 29 మ్యాచులు జరిగితే, ముంబై 22 విజయాలు అందుకుంది...

29

ఐపీఎల్ సక్సెస్ కారణంగానే మాజీ సారథి విరాట్ కోహ్లీ స్థానంలో టీమిండియా మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ అందుకున్నాడు రోహిత్ శర్మ...
 

39

కెప్టెన్సీ అందుకున్న సమయం నుంచి వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు టీమిండియా నయా సారథి రోహిత్ శర్మ...

49

మొహాలీలో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకను ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో చిత్తు చేసిన రోహిత్ టీమ్, బెంగళూరులో మార్చి 12 నుంచి మొదలయ్యే రెండో టెస్టు కోసం ఎదురుచూస్తోంది...

59

‘కెప్టెన్‌గా రోహిత్ శర్మ టీమ్‌తో ఆడాలంటే కొంచెం భయపడేవాడిని. అతని కెప్టెన్సీ నాకు నిద్రలేని రాత్రులను మిగిల్చాయి...

69

క్రిస్ గేల్, ఏబీ డివిల్లియర్స్ వంటి భారీ హిట్టర్లు కూడా నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టింది లేదు, కానీ కెప్టెన్‌గా రోహిత్ శర్మ రేంజ్ వేరు...

79

రోహిత్ శర్మ కెప్టెన్‌గా, ప్లేయర్‌గా ఐపీఎల్‌లో నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు, నిద్రలేని రాత్రులను మిగిల్చాడు..’ అంటూ చెప్పుకొచ్చాడు గౌతమ్ గంభీర్...

89

‘ఐపీఎల్‌లో రోహిత్ శర్మకు మించిన సక్సెస్‌ఫుల్ కెప్టెన్ లేడు. మిగిలినవాళ్లు టైటిల్స్ గెలిచినా, ఎన్ని సీజన్లు ఆడారో లెక్కించుకోవాలి...’ అంటూ కామెంట్ చేశాడు గౌతీ...

99

గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ 2012లో చెన్నై సూపర్ కింగ్స్‌ని, 2014లో పంజాబ్ కింగ్స్‌ని ఓడించి టైటిల్స్ గెలుచుకుంది. 

Read more Photos on
click me!

Recommended Stories