ఆ విషయంలో వార్న్ టాప్.. తర్వాత తరం బౌలర్లకు అది కష్టమే.. స్పిన్ దిగ్గజానికి అశ్విన్ స్పెషల్ ట్రిబ్యూట్

Published : Mar 09, 2022, 03:53 PM IST

Ravichandran Ashwin: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవలే భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ టెస్టులలో అత్యధిక వికెట్ల రికార్డును అధిగమించాడు.  అయితే గత తరం బౌలర్ల మాదిరిగా... 

PREV
19
ఆ విషయంలో వార్న్ టాప్.. తర్వాత తరం బౌలర్లకు అది కష్టమే.. స్పిన్ దిగ్గజానికి అశ్విన్ స్పెషల్ ట్రిబ్యూట్

ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం పై ప్రపంచ క్రికెట్ ప్రేమికులంతా  విచారం వ్యక్తం చేస్తున్న వేళ..అతడిని ఎంతగానో ఆరాధించే  టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ స్పిన్ దిగ్గజానికి స్పెషల్ ట్రిబ్యూట్ ఇచ్చాడు.

29

టెస్టులు, వన్డేలలో కలిపి వార్న్ ఎన్నో వందలాది రికార్డులను నెలకొల్పాడని,  ఆయనను అందుకోవడం ప్రస్తుత తరం బౌలర్ల వల్ల కాదని  అశ్విన్ అభిప్రాయపడ్డాడు.

39

వార్న్ మరణానంతరం తొలిసారి తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా అశ్విన్ మాట్లాడుతూ... ‘షేన్ వార్న్ ఒక విలక్షణమైన  వ్యక్తి.   స్పిన్ బౌలింగ్ అనే పదాన్ని అతడు పునర్నిర్వచించాడు.   టెస్టులు, వన్డేలలో కలిపి వార్న్  వెయ్యి కంటే ఎక్కువ వికెట్లు తీశాడు.

49

ఇప్పుడు టెస్టు క్రికెట్ మీద  ఆసక్తి చాలా మందికి తగ్గిపోతుంది.  దేశానికో లీగ్ ఉన్నందున..  క్రికెటర్లంతా  పరిమిత ఓవర్ల క్రికెట్ మీదే ఫోకస్ చేస్తున్నారు. కానీ వార్న్ అలా కాదు. ప్రపంచ స్పిన్ బౌలింగ్ బాధ్యతలను ఆయన తన భుజాలపై మోశాడు.  నా దృష్టిలో అతడు ఒక టార్చ్ బేరర్ వంటివాడు.

59

ఈ క్రికెట్ ప్రపంచానికి స్పిన్ తో అటాక్ చేయవచ్చని నేర్పరి షేన్ వార్న్.పిచ్ పెద్దగా సహకరించకపోయినా.. దాని మీద కూడా వికెట్లు రాబట్టగల నేర్పరి ఆయన...’ అని చెప్పుకొచ్చాడు.

69

షేన్ వార్న్ మాదిరిగా  అంతర్జాతీయ క్రికెట్ లో వెయ్యి వికెట్లు తీయడమనేది తర్వాత తరం బౌలర్లు మరిచిపోతారని అశ్విన్ అన్నాడు.  టెస్టులలో  708  వికెట్లు తీసిన వార్న్.. వన్డేలలో 293 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా అతడి అంతర్జాతీయ కెరీర్ లో 1,001 వికెట్లు తీశాడు.

79

కాగా.. వార్న్ బాల్ ఆఫ్ ది డెలివరీ అంటే అందరికీ ఇష్టమని, కానీ తనకు మాత్రం 2005 యాషెస్ సిరీస్ లో భాగంగా ఆండ్రూ స్ట్రాస్ ను ఔట్ చేసిన బంతి అంటే  చాలా ఇష్టమని చెప్పాడు. మొత్తంగా ఆ సిరీస్ లో  వార్న్ ఒంటిచేత్తో ఆసీస్ తరఫున పోరాడాడని అశ్విన్ అన్నాడు. 2005 యాషెస్ టెస్టు సిరీస్ లో వార్న్.. ఏకంగా 40కి పైగా వికెట్లు పడగొట్టాడు. 

89

ఇదిలాఉండగా ఇటీవలే లంకతో జరిగిన టెస్టులో  435 వికెట్ తీసి భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ను అధిగమించిన అశ్విన్... చిన్నప్పుడు తన తండ్రి తనను మీడియం పేస్ బౌలింగ్ నేర్చుకోవాలని సూచించాడని తెలిపాడు. తద్వారా అశ్విన్.. కపిల్ లా  పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా ఎదుగుతావని సూచించాడని చెప్పాడు.

99

1994లో బ్యాటింగ్ అంటే తనకు చాలా ఇష్టం ఉండేదని, భారత్ లో కోట్లాది మంది లాగే తాను కూడా సచిన్ టెండూల్కర్ కు వీరాభిమానిని అని అశ్విన్ అన్నాడు. అయితే తాను ఇండియాకు ఆడతానని కలలో కూడా అనుకోలేదని, కానీ ఇప్పుడు కపిల్ దేవ్ రికార్డును అధిగమించడం  కొంచెం ఆశ్చర్యంగా ఉందని తెలిపాడు.

click me!

Recommended Stories