రోహిత్ శర్మ ఆ ప్లేస్‌లో బ్యాటింగ్ చేయలేడు! ఎవ్వరూ లేకుంటే విరాట్ కోహ్లీని ఆడిస్తే బెటర్.. - సునీల్ గవాస్కర్

Published : Aug 27, 2023, 11:11 AM IST

టీ20 వరల్డ్ కప్ 2021, 2022 టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో టీమిండియా ఓటములకు బౌలింగ్ వైఫ్యలంతో పాటు బ్యాటింగ్ ఆర్డర్‌లో చేసిన ప్రయోగాలు కూడా ఓ కారణం. రోహిత్ శర్మ ఓపెనర్‌గా కాకుండా వన్‌డౌన్‌లో, నాలుగో స్థానంలో వచ్చిన మ్యాచుల్లో టీమిండియాకి పరాజయం ఎదురైంది..

PREV
16
రోహిత్ శర్మ ఆ ప్లేస్‌లో బ్యాటింగ్ చేయలేడు! ఎవ్వరూ లేకుంటే విరాట్ కోహ్లీని ఆడిస్తే బెటర్.. - సునీల్ గవాస్కర్

వెస్టిండీస్ టూర్‌లో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌ల్లోనూ బ్యాటింగ్ ఆర్డర్‌లో రకరకాల ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకుంది టీమిండియా. మొదటి వన్డేలో 115 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి 5 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఓపెనర్‌గా రావాల్సిన రోహిత్ శర్మ, కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం పెద్దగా వర్కవుట్ కాలేదు..

26

ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ చేసినా, టీమిండియాకి కాపాడడానికి రోహిత్ శర్మ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి రావాల్సి వచ్చింది. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఇలాంటి ప్రయోగాలు చేస్తే, భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...

36

‘బ్యాటింగ్ ఆర్డర్‌లో నచ్చిన మార్పులు చేసే వెసులుబాటు ఉండడం ఏ టీమ్‌కైనా వరమే. అయితే టాపార్డర్‌ని ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయకపోవడం టీమిండియాకి చాలా మంచిది. రోహిత్ శర్మ ఓపెనర్‌గా వస్తేనే బెటర్..

46

ఎందుకంటే ఓపెనర్‌గా కాకుండా ఏ పొజిషన్‌లోనూ అతనికి మెరుగైన రికార్డు లేదు. మరీ అంత అవసరమైతే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేయడానికి ఎవ్వరూ  లేకపోతే ఆ పొజిషన్‌లో విరాట్ కోహ్లీని ఆడించొచ్చు..
 

56

అదీకాకుండా ఓపెనర్లు త్వరగా అవుటైతే, విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో వస్తే బెటర్. ఓపెనర్లు 10 ఓవర్లకు పైగా బ్యాటింగ్ చేస్తే మాత్రం వన్‌డౌన్‌లోనే రావాలి. వికెట్లు కాపాడుకోవాల్సి వస్తే, విరాట్ పాత్ర చాలా కీలకంగా మారుతుంది..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్..

66

ఓపెనర్‌గా ఇషాన్ కిషన్‌కి వన్డేల్లో మంచి రికార్డు ఉంది. ఇప్పటిదాకా 16 ఇన్నింగ్స్‌ల్లో 46.27 సగటుతో 694 పరుగులు చేశాడు ఇషాన్ కిషన్. ఇందులో ఓపెనర్‌గా 6 హాఫ్ సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories