ఇలాగైతే రోహిత్ ఎక్కువ కాలం కెప్టెన్‌గా ఉండడు... పాక్ మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ షాకింగ్ కామెంట్...

First Published Sep 2, 2022, 5:15 PM IST

టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుస సిరీస్ విజయాలతో దూసుకుపోతున్నాడు రోహిత్ శర్మ. 37 టీ20 మ్యాచుల్లో 30 విజయాలు అందుకుని, అత్యధిక టీ20 విజయాలు అందుకున్న భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని దాటేసిన రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు పాక్ మాజీ ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్...

Image credit: PTI

రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరుసగా ద్వైపాక్షిక సిరీస్‌లు గెలుస్తూ వచ్చిన భారత జట్టు, ఆసియా కప్ 2022 టోర్నీలోనూ తొలి రెండు మ్యాచుల్లో నెగ్గి గ్రూప్ టాపర్‌గా ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించింది. అయితే హంగ్ కాంగ్‌తో మ్యాచ్‌లో రోహిత్ బాడీ లాంగ్వేజ్ సరిగా లేదంటున్నాడు పాక్ మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్...

Rohit Sharma-Babar Azam

‘రోహిత్ శర్మ ఎక్స్‌ప్రెషన్స్ చూడండి. ఇది టీమిండియా 40 పరుగుల తేడాతో హంగ్ కాంగ్‌పై గెలిచిన తర్వాత... విజయం వచ్చిందనే సంతోషం అతని ముఖంలో కనిపించడం లేదు. నేను టాస్ జరిగినప్పటి నుంచి అతని బాడీ లాంగ్వేజ్ గమనిస్తున్నా...

Image credit: Getty

ఎందుకో రోహిత్ శర్మ భయపడుతున్నట్టు, అయోమయంగా ఉన్నాడు. అతనిలో ఆత్మవిశ్వాసం లోపించినట్టుంది. అందుకే ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తున్న వాడిలా కనిపిస్తున్నాడు. ఐపీఎల్‌ 2022లో అతనికి ఏదీ కలిసి రాలేదు...

Rohit Sharma Press

ఐపీఎల్ తర్వాత కూడా అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్దగా పరుగులు చేయలేకపోయాడు. విజయాలు వస్తున్నా అందులో అతను చేసింది తక్కువ. అదీకాకుండా భారత జట్టును నడిపిస్తున్న కెప్టెన్సీ ప్రెషర్. అతను బ్రాండ్ ఆఫ్ క్రికెట్, పాజిటివ్ క్రికెట్, అగ్రెసివ్ క్రికెట్ అని ఏవేవో మాటలు చెబుతున్నాడు...

Image credit: Getty

అయితే టీమిండియా ఆటలో నాకైతే ఇవేమీ కనిపించలేదు. భారత జట్టు ఆటలోనే కాదు, రోహిత్ శర్మ బాడీ లాంగ్వేజ్‌లో కూడా ఇది కనిపించడం లేదు. మాటలు చెప్పడం చాలా తేలికే కానీ వాటిని చేతల్లో చూపించడం చాలా కష్టం...

rohit

నా అంచనా ప్రకారం రోహిత్ శర్మ ఎక్కువ కాలం కెప్టెన్‌గా కొనసాగడు. అతని పేలవ ఫామ్, ప్రెషర్ కారణంగా త్వరలోనే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడు. రోహిత్ శర్మ ఎప్పుడూ తన ఆటను తాను ఎంజాయ్ చేస్తాడు. అతను ఎక్స్‌ప్రెషన్స్ పెద్దగా చూపించడు...

Mohammad Hafeez

రోహిత్ శర్మ చాలా టాలెంటెడ్ ప్లేయర్, కెప్టెన్... అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు అతను హ్యాపీగా లేడు. అతని మెదడులో చాలా ఆలోచనలు తొలిచి వేస్తున్నాయి. చాలా ప్రెషర్‌లో కనిపిస్తున్నాడు... అతన్ని ఇలా చూస్తుంటే బాధగా ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు మహ్మద్ హఫీజ్.. 

click me!