టీ20 వరల్డ్ కప్‌ 2022 టోర్నీకి జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్... జాసన్ రాయ్‌, జోఫ్రా ఆర్చర్‌లకు...

Published : Sep 02, 2022, 04:48 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో గ్రూప్ టాపర్‌గా సెమీస్ చేరిన ఇంగ్లాండ్, న్యూజిలాండ్ చేతుల్లో ఓడింది. ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలో గత ఎడిషన్ ఆడిన ఇంగ్లాండ్ జట్టు, ఈసారి కొత్త కెప్టెన్ జోస్ బట్లర్ కెప్టెన్సీలో పొట్టి ప్రపంచకప్ ఆడనుంది...

PREV
17
టీ20 వరల్డ్ కప్‌ 2022 టోర్నీకి జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్... జాసన్ రాయ్‌, జోఫ్రా ఆర్చర్‌లకు...

కొన్ని నెలలుగా పేలవ ఫామ్‌ని కొనసాగిస్తున్న ఇంగ్లాండ్ ఓపెనర్ జాసన్ రాయ్‌కి టీ20 వరల్డ్ కప్ 2022 జట్టులో చోటు దక్కలేదు. అతని స్థానంలో ఈ ఏడాది టీ20 ఆరంగ్రేటం చేసిన ఫిలిప్ సాల్ట్‌కి 15 మంది జట్టులో చోటు దక్కింది...

27

గత ఏడాది టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత 11 టీ20 మ్యాచులు ఆడిన జాసన్ రాయ్, 18.72 సగటుతో కేవలం 206 పరుగులు మాత్రమే చేశాడు. ‘ది హండ్రెడ్’ లీగ్‌లోనూ జాసన్ రాయ్ చెప్పుకోదగ్గ పర్పామెన్స్ ఇవ్వలేకపోయాడు...

37
Phil Salt

ఇదే సమయంలో ఫిలిప్ సాల్ట్, దేశవాళీ టోర్నీల్లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ది హండ్రెడ్ లీగ్‌లో 8 మ్యాచుల్లో 44.71 సగటుతో 313 పరుగులు చేశాడు ఫిలిప్ సాల్ట్. ఈ పర్ఫామెన్స్‌తో అతనికి వరల్డ్ కప్ ఆడే అవకాశం దక్కింది...

47
Moeen Ali

ప్రస్తుతం జోస్ బట్లర్ గాయంతో బాధపడుతున్నాడు. అతని స్థానంలో మొయిన్ ఆలీ, పాక్ టూర్‌లో ఇంగ్లాండ్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. ఈ పర్యటనలో ఇంగ్లాండ్ 7 టీ20 మ్యాచులు ఆడుతుంది... 

57

డేవిడ్ మలాన్, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్‌కి టీ20 వరల్డ్ కప్ 2022 జట్టులో చోటు కల్పించిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, గాయం కారణంగా జట్టుకి దూరమైన జోఫ్రా ఆర్చర్‌ని మరో టోర్నీకి దూరం పెట్టింది. ఐపీఎల్ 2021 టోర్నీకి ముందు గాయపడిన జోఫ్రా ఆర్చర్, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో కూడా ఆడలేదు...

67

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఇంగ్లాండ్ జట్టు ఇదే: జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ ఆలీ, జానీ బెయిర్‌స్టో, హారీ బ్రూక్స్, సామ్ కుర్రాన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలాన్, అదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లే, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్
 

77

రిజర్వు ప్లేయర్లుగా తైమల్ మిల్స్, లియామ్ డ్వాసన్, రిచర్డ్ గ్లీసన్‌లకు పొట్టి ప్రపంచ కప్‌లో చోటు దక్కింది. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కూడా ఆడుతుంది ఇదే జట్టు...
 

click me!

Recommended Stories