2018 ఆసియా కప్ విన్నింగ్ టీమ్‌లో మిగిలింది వీళ్లే... అప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో...

First Published Aug 25, 2023, 3:24 PM IST

2016లో ధోనీ నుంచి మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు విరాట్ కోహ్లీ. కెప్టెన్‌గా 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్‌ని ఫైనల్ చేర్చాడు. అయితే ఫైనల్‌లో టీమిండియా, పాకిస్తాన్ చేతుల్లో చిత్తుగా ఓడింది. ఆ తర్వాత 2018 ఆసియా కప్ టోర్నీకి విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నాడు..

Asia Cup 2018

2008లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన విరాట్ కోహ్లీ, 2017లో అనుష్క శర్మను వివాహం చేసుకున్నాడు. పెళ్లైన తర్వాత కూడా భార్యతో సమయం గడపడానికి కూడా వీల్లేకుండా బిజీ షెడ్యూల్‌లో గడిపాడు విరాట్. దీంతో 2018 సెప్టెంబర్‌లో ఆసియా కప్ టోర్నీ నుంచి విరాట్‌కి విశ్రాంతినిచ్చింది బీసీసీఐ..

Asia Cup 2018

విరాట్ కోహ్లీ లేకుండా రోహిత్ శర్మ కెప్టెన్సీలో 2018 ఆసియా కప్ ఆడిన భారత జట్టు, ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ని ఓడించి టైటిల్ విజేతగా నిలిచింది. 

Latest Videos


Asia Cup 2018

గ్రూప్ స్టేజీలో టీమిండియా ప్లేయర్లు హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ గాయాలతో ఆసియా కప్ 2023 టోర్నీ నుంచి తప్పుకున్నారు. వీరి స్థానంలో రవీంద్ర జడేజా, దీపక్ చాహార్, సిద్ధార్థ్ కౌల్.. నాకౌట్ మ్యాచులు ఆడారు..

Asia Cup 2018

హంగ్‌కాంగ్‌తో మ్యాచ్‌లో 26 పరుగుల తేడాతో నెగ్గిన టీమిండియా, పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. ఆ తర్వాత సూపర్ 4 రౌండ్‌లో బంగ్లాదేశ్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది టీమిండియా..

Asia Cup 2018

పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో విజయం అందుకున్న టీమిండియా, ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌ని టై చేసుకుంది. ఆఫ్ఘాన్ తొలుత బ్యాటింగ్ చేసి 252 పరుగులు చేయగా ఈ లక్ష్యఛేదనలో భారత జట్టు 49.5 ఓవర్లలో సరిగ్గా 252 పరుగులకి ఆలౌట్ అయ్యింది...

Asia Cup 2018

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ రెస్ట్ తీసుకుని, ధోనీకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాడు. అప్పటికి 199 వన్డేలకు కెప్టెన్సీ చేసిన మహేంద్ర సింగ్ ధోనీకి కెప్టెన్‌గా ఇది 200వ వన్డే.  ఆసియా కప్ చరిత్రలో టైగా ముగిసిన మొట్టమొదటి వన్డే ఇదే. అలాగే ఆఫ్ఘాన్‌కి కూడా ఇదే మొదటి టై మ్యాచ్..

Asia Cup 2018 Final

పాకిస్తాన్‌పై 37 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించి ఫైనల్ చేరింది బంగ్లాదేశ్... ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 222 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఈ లక్ష్యాన్ని ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి ఛేదించి... ఆసియా కప్ టైటిల్ కైవసం చేసుకుంది భారత జట్టు. 

Asia Cup 2018

ఆసియా కప్ 2018 టోర్నీలో 2 సెంచరీలతో 68.4 యావరేజ్‌తో 102.08 స్ట్రైయిక్ రేటుతో 342 పరుగులు చేసి, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ గెలిచాడు శిఖర్ ధావన్. 2018 ఆసియా కప్ ఫైనల్ ఆడిన జట్టులో కేవలం నలుగురు మాత్రమే 2023 ఆసియా కప్ జట్టులో చోటు దక్కించుకోగలిగారు..

Asia Cup 2018

కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ మాత్రమే ఆసియా కప్ 2018 ఫైనల్ మ్యాచ్ ఆడారు. ఓవరాల్‌గా కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ కూడా ఆసియా కప్ 2018 టోర్నీ గెలిచిన టీమ్‌లో సభ్యులుగా ఉన్నారు.. 

Asia Cup 2018

కెప్టెన్‌గా ఆసియా కప్ 2018 టైటిల్ గెలిచిన రోహిత్ శర్మ, విమర్శకులను మెప్పించి, టీమిండియాకి పూర్తి స్థాయి కెప్టెన్‌గా చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్లు చేసిన మూడేళ్లకు అతనికి టీమిండియా కెప్టెన్సీ దక్కింది. 

click me!