వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైపోయింది. 10 ఏళ్లుగా ఐసీసీ టోర్నీలు గెలవలేక తీవ్రమైన ట్రోలింగ్ ఫేస్ చేస్తున్న టీమిండియాకి, ఇదో అత్యద్భుత అవకాశం. స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ గెలవడం కంటే మంచి ఛాన్స్ మరోటి దొరకదు...
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు ఆసియా కప్ 2023 టోర్నీ కోసం శ్రీలంక వెళ్లనుంది టీమిండియా. సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆ తర్వాత నేపాల్‌తో మ్యాచులు ఆడే టీమిండియా... సూపర్ 4 రౌండ్ దాకా వెళ్లడం అయితే పక్కా. గత ఏడాది టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్ టోర్నీలోనూ సూపర్ 4 రౌండ్‌కి వెళ్లింది టీమిండియా...
29
సూపర్ 4 రౌండ్‌లో పాకిస్తాన్, శ్రీలంక చేతుల్లో ఓడి ఫైనల్‌కి ఆమడ దూరంలో ఆగిపోయింది టీమిండియా. ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టడంతో టాపిక్ డైవర్ట్ అయిపోయి... గత రెండు మ్యాచుల్లో టీమిండియా ఓటమి గురించి పెద్దగా చర్చ జరగలేదు.
39
ఆసియా కప్ 2023 ముగిసిన తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చే భారత జట్టు, ఆస్ట్రేలియాతో మూడు మ్యాచుల వన్డే సిరీస్ ఆడుతుంది... ఆసియా కప్ 2023 టోర్నీలో టీమిండియా టైటిల్ గెలిస్తే, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ముందు టీమిండియా ఉత్సాహం, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి.
49
అదే ఎనర్జీతో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో టీమిండియా మళ్లీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్లకు రెస్ట్ ఇచ్చి ఆడొచ్చు.. ఒకవేళ ఆసియా కప్ 2023 టోర్నీలో రిజల్ట్ తేడా కొడితే.. టీమిండియా పరిస్థితి ఏంటి?
59
Virat Kohli and Rohit Sharma
ఆసియా కప్ టోర్నీ ముగిసిన తర్వాత వన్డే వరల్డ్ కప్ టోర్నీకి మధ్య పెద్ద సమయం కూడా లేదు. ఆసియా కప్‌లో భారత జట్టు ఆశించిన స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోతే మాత్రం ఆ ఎఫెక్ట్ కచ్ఛితంగా ప్రపంచ కప్‌పై పడుతుంది..
69
ఇప్పటికే గత రెండేళ్లలో నాలుగు ఐసీసీ టోర్నీల్లో ఓడింది భారత జట్టు. టీ20 వరల్డ్ కప్ 2021, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021 ఫైనల్, టీ20 వరల్డ్ కప్ 2022, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023 టోర్నీల్లో టైటిల్ సాధించలేకపోయింది. ఇది టీమ్ వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది..
79
వెస్టిండీస్ టూర్‌లో టీ20 సిరీస్ ఓడిపోయినా సీనియర్లు లేకుండా బరిలో దిగడం వల్లే ఓడిపోయామని సర్దిచెప్పుకోవడానికి ఓ సాకు దొరికింది. ఆసియా కప్‌లో కోహ్లీ, రోహిత్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా... ఇలా టీమిండియా స్టార్ ప్లేయర్లందరూ ఆడబోతున్నారు..
89
దీంతో ఈసారి ఆసియా కప్ రిజల్ట్ తేడా కొడితే మాత్రం.. భారత జట్టు తీవ్రమైన ట్రోలింగ్ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. ఇది అక్టోబర్‌లో మొదలయ్యే వన్డే వరల్డ్ కప్‌లో ప్రభావం చూపించొచ్చు..
99
2007 వన్డే వరల్డ్ కప్‌లో గ్రూప్ స్టేజీ నుంచే నిష్కమించిన భారత జట్టు, ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచింది. అయితే అప్పుడు టీమిండియాకి రెండు టోర్నీల మధ్య ఆరు సమయం దొరికింది. కానీ ఇప్పుడు ఆసియా కప్‌కీ, వరల్డ్ కప్‌కీ మధ్య నెల రోజుల గ్యాప్ కూడా లేదు. కాబట్టి టీమ్ మేనేజ్‌మెంట్‌కి చాలా పని పడనుంది..