యో-యో స్కోర్లు బయటపెట్టకండి! విరాట్ కోహ్లీ ఇన్‌స్టా పోస్టుతో బీసీసీఐ సీరియస్...

Published : Aug 25, 2023, 01:24 PM IST

ఆసియా కప్ 2023 టోర్నీకి ముందు టీమిండియా, ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో బీసీసీఐ క్యాంపులో పాల్గొంటోంది. బుధవారం నిర్వహించిన యో-యో పరీక్షల్లో విరాట్ కోహ్లీ 17.2 పాయింట్లతో పాస్ అయినట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు..  

PREV
16
యో-యో స్కోర్లు బయటపెట్టకండి! విరాట్ కోహ్లీ ఇన్‌స్టా పోస్టుతో బీసీసీఐ సీరియస్...

విరాట్ కోహ్లీ, తన యో-యో టెస్టు పాయింట్లను బయటపెట్టడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మీమ్స్ వైరల్ అయ్యాయి. విరాట్ కోహ్లీకే 17.2 పాయింట్లు వచ్చాయంటే రోహిత్ శర్మ, ఫిట్‌నెస్ టెస్టు క్లియర్ చేయడం కూడా కష్టమేనంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ ప్రత్యక్షం అయ్యాయి..

26

అంతేకాకుండా కొందరు పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్, విరాట్ కోహ్లీ యో-యో స్కోరును పాక్ ప్లేయర్లతో పోల్చి చూడడం మొదలెట్టారు. పాక్ క్రికెటర్ షాన్ మసూద్, యో-యో టెస్టులో 23.2 పాయింట్లు సాధించాడు. దీంతో విరాట్ కంటే షాన్ మసూద్ ఫిట్ ప్లేయర్ అంటూ కొన్ని వార్తలు ప్రచురితమయ్యాయి.. 
 

36
Rohit Sharma

దీంతో ప్లేయర్లు, తమ యో-యో టెస్టు పాయింట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని మానుకోవాలని టీమిండియాకి బీసీసీఐ అధికారులు హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం... 

46
Rahul Dravid-Hardik Pandya

‘యో-యో టెస్టుకు సంబంధించిన సమాచారం గోప్యంగా ఉంచాలని, సోషల్ మీడియాలో పోస్టు చేయకూడదని ప్లేయర్లకు తెలియచేయడం జరిగింది. ట్రైయినింగ్‌లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేయడం, స్కోర్లను పోస్ట్ చేయడం కూడా క్రమశిక్షణా రాహిత్య చర్యగా పరిగణిస్తాం..’ అంటూ ఓ బీసీసీఐ అధికారి తెలియచేసినట్టు ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్ రాసుకొచ్చింది..

56

ఆసియా కప్ 2023 టోర్నీకి ముందు 6 రోజుల పాటు ఈ క్యాంపులో పాల్గొనబోతున్నారు టీమిండియా క్రికెటర్లు. విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా కూడా ఫిట్‌నెస్ టెస్టు క్లియర్ చేశారు. మిగిలిన ప్లేయర్ల గురించి ఇంకా రిపోర్టులు రాలేదు..
 

66

వెస్టిండీస్‌లో టెస్టు సిరీస్‌ నుంచి రెస్ట్ తీసుకున్న మహ్మద్ షమీతో పాటు వన్డే సిరీస్‌కి ముందు గాయపడిన మహ్మద్ సిరాజ్ కూడా 14 రోజులుగా బీసీసీఐ క్యాంపులోనే ఉండి, శిక్షణ తీసుకుంటున్నారు. ఈ ఇద్దరూ పూర్తి ఫిట్‌నెస్ సాధించి, ఆసియా కప్ 2023 జట్టులో చోటు దక్కించుకున్నారు... 
 

Read more Photos on
click me!

Recommended Stories