రోహిత్ శర్మ ఈజీగా రెండు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ బాదేస్తాడు... టీమిండియా కెప్టెన్‌పై ఆకాశ్ చోప్రా కామెంట్...

Published : Aug 26, 2023, 11:57 AM IST

టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన రేంజ్ ఇన్నింగ్స్‌లు అయితే ఆడలేకపోయాడు రోహిత్ శర్మ. గత ఏడాది ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీల్లోనూ రోహిత్ శర్మ బ్యాటు నుంచి సరైన పర్ఫామెన్స్‌లు రాలేదు...  

PREV
18
రోహిత్ శర్మ ఈజీగా రెండు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ బాదేస్తాడు... టీమిండియా కెప్టెన్‌పై ఆకాశ్ చోప్రా కామెంట్...

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లోనూ అట్టర్ ఫ్లాప్ అయిన రోహిత్ శర్మ, అంతకుముందు జరిగిన ఐపీఎల్‌లోనూ ఫెయిల్ అయ్యాడు. అయితే వెస్టిండీస్ టూర్‌లో టెస్టు సెంచరీ అందుకున్న రోహిత్, వన్డే వరల్డ్ కప్ 2023లో కీ ప్లేయర్‌గా మారబోతున్నాడు..

28

2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో 5 సెంచరీలతో వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన రోహిత్ శర్మ, 81 సగటుతో 648 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ 673 పరుగుల రికార్డుకు 25 పరుగుల దూరంలో ఆగిపోయాడు రోహిత్...
 

38

‘టాపార్డర్‌లో టీమిండియాకి టాప్ క్లాస్ ప్లేయర్లు ఉన్నారు. శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. టీమిండియా, వరల్డ్ కప్ గెలవాలంటే ఈ ముగ్గురిపైనే ఆధారపడి ఉంది. వీళ్లు చేసే పరుగులే టీమ్‌కి చాలా కీలకం..
 

48

రోహిత్ శర్మ ఇప్పటిదాకా వన్డేల్లో 9800లకు పైగా పరుగులు చేశాడు. అందులో 30 సెంచరీలు కూడా ఉన్నాయి. వన్డేల్లో అతని సగటు 49కి చాలా దగ్గరగా ఉంది. వన్డేల్లో రోహిత్ శర్మ స్ట్రైయిక్ రేటు 90కి పైనే ఉంది...

58

రోహిత్ శర్మ చేసిన ఎక్కువ పరుగులు ఆసియాలోనే వచ్చాయి. కాబట్టి ఈసారి వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ నుంచి భారీ పర్ఫామెన్స్ వస్తుందని అనుకుంటున్నా. నా అంచనా ప్రకారం ఈసారి వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ 2 సెంచరీలు, ఓపెనర్‌గా ఓ డబుల్ సెంచరీ బాదేస్తాడు..
 

68
Image credit: PTI

శుబ్‌మన్ గిల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. రోహిత్ శర్మతో పోలిస్తే శుబ్‌మన్ గిల్‌ అనుభవం తక్కువ. అయితే అతను ఆడిన 27 వన్డేల్లో 62 సగటుతో పరుగులు చేశాడు. ఆసియాలో అతని యావరేజ్ 64. అతను చేసిన నాలుగు సెంచరీల్లో మూడు ఆసియాలోనే వచ్చాయి..

78
Image credit: PTI

శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ మధ్య మంచి సమన్వయం ఏర్పడింది. ఈ ఇద్దరి భాగస్వామ్యం టీమ్‌కి స్పెషల్ ఎనర్జీని ఇస్తుంది. ఆ ఇద్దరినీ దాటితే వన్డే క్రికెట్‌కి బాబులాంటోడు విరాట్ కోహ్లీ ఉన్నాడు. అతను ఇప్పటికే 13 వేల పరుగులు, 275 మ్యాచులు, 46 సెంచరీలు చేశాడు..
 

88
Image credit: PTI

కోహ్లీ చేసిన 46 సెంచరీల్లో 31 సెంచరీలు ఆసియాలోనే వచ్చాయి. ఆసియాలో అతని యావరేజ్ 58. కాబట్టి ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023లో ఈ ముగ్గురూ తమ స్థాయికి తగ్గట్టుగా రాణిస్తే చాలు, టీమిండియాకి ఎలాంటి కష్టాలు ఉండవు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. 

Read more Photos on
click me!

Recommended Stories