యో-యో టెస్టులో శుబ్‌మన్ గిల్‌కి విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ స్కోరు... బయటికి చెప్పొద్దని హెచ్చరించినా...

Published : Aug 26, 2023, 11:02 AM IST

ఆసియా కప్ 2023 టోర్నీకి ముందు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో బీసీసీఐ క్యాంపులో పాల్గొంటోంది భారత జట్టు. ఈ క్యాంపులో ప్లేయర్లకు ఫిట్‌నెస్ పరీక్షలు కూడా నిర్వహించారు. ఆసియా కప్ ఆడబోయే ప్లేయర్లు అందరూ ఈ యో-యో టెస్టు క్లియర్ చేశారు..

PREV
18
యో-యో టెస్టులో శుబ్‌మన్ గిల్‌కి విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ స్కోరు... బయటికి చెప్పొద్దని హెచ్చరించినా...

విరాట్ కోహ్లీ, తనకు యో-యో టెస్టులో 17.2 పాయింట్లు వచ్చినట్టు సోషల్ మీడియా ద్వారా తెలియచేసిన విషయం తెలిసిందే. దీంతో ఇలాంటి సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని, బయటికి చెప్పకూడదని బీసీసీఐ అధికారులు హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి..

28

అయితే తాజాగా ఆసియా కప్ 2023 టోర్నీలో పాల్గొనబోయే ఆటగాళ్లకు సంబంధించిన యో-యో స్కోర్లు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.  శుక్రవారం నిర్వహించిన యో-యో టెస్టులో భారత యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్, 18.7 పాయింట్లు సాధించి... టాప్ స్కోరర్‌గా నిలిచినట్టు సమాచారం..
 

38

యో-యో టెస్టులో చాలా మంది ప్లేయర్లు 16.5 పాయింట్ల నుంచి 18 పాయింట్ల మధ్యే స్కోరు చేయడం విశేషం. విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా కూడా తొలి రోజే ఫిట్‌నెస్ టెస్టు క్లియర్ చేశారు.. 

48
Rahul Dravid-Hardik Pandya

ఆగస్టు 29 వరకూ ఈ క్యాంపు కొనసాగనుంది. అప్పటివరకూ ప్రతీ రోజూ 6 గంటల పాటు ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటారు భారత క్రికెటర్లు. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తారు..

58

అలాగే గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోని కెఎల్ రాహుల్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది బీసీసీఐ. దీంతో అతను ఎక్కువ సమయం ప్రాక్టీస్ సెషన్స్‌లోనే గడపబోతున్నాడు..
 

68
sai kishore

సాయి కిషోర్‌తో పాటు దాదాపు 10-12 మంది బౌలర్లు, ఈ క్యాంపులో టీమిండియాకి నెట్ బౌలర్లుగా వ్యవహరించబోతున్నారు. ప్రస్తుతం ఏ దేశవాళీ టోర్నీ కూడా లేకపోవడంతో ఎక్కువ మంది బౌలర్లు, ఈ క్యాంపులోనే ఉన్నారు.. 
 

78
Sanju Samson and Ruturaj Gaikwad

రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో ఆసియా క్రీడల కోసం చైనాకి వెళ్లే టీమ్ కూడా ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలోనే శిక్షణ తీసుకుంటోంది. ఈ బ్యాచ్ ట్రైయినింగ్‌ని వీవీఎస్ లక్ష్మణ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు. 

88

భారత జట్టు ట్రైయినింగ్‌ సెషన్స్‌ని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌తో పాటు కోచింగ్ స్టాఫ్ క్షుణ్ణంగా మానిటర్ చేస్తోంది. ఈసారి ఆటగాళ్ల ఫిట్‌నెస్ విషయంలో రాజీ పడకుండా ప్లేయర్లను ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ కోసం మానసికంగా, శారీరకంగా సిద్ధం చేసే పనిలో పడింది బీసీసీఐ.. 

Read more Photos on
click me!

Recommended Stories