ఆ ఇద్దరికీ టీమిండియాలో ఉండే అర్హత లేదు! టీమిండియా సీనియర్ ప్లేయర్లపై పాక్ మాజీ బౌలర్ కామెంట్స్...

Published : Aug 26, 2023, 11:30 AM IST

ఆసియా కప్ 2023 టోర్నీలో ఇండియా, పాకిస్తాన్ టైటిల్ ఫెవరెట్లు. ఇప్పటికీ శ్రీలంక చేరుకుని ఆఫ్ఘాన్‌తో వన్డే సిరీస్ ఆడుతోంది పాకిస్తాన్. టీమిండియా ప్రస్తుతం బెంగళూరులో బీసీసీఐ క్యాంపులో శిక్షణ తీసుకుంటోంది...  

PREV
17
ఆ ఇద్దరికీ టీమిండియాలో ఉండే అర్హత లేదు! టీమిండియా సీనియర్ ప్లేయర్లపై పాక్ మాజీ బౌలర్ కామెంట్స్...
Sanju and Chahal

ఆసియా కప్ 2023 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో టీమిండియా సీనియర్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ పేరు లేకపోవడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. 2021 టీ20 వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకోలేకపోయిన చాహాల్, 2022 టీ20 వరల్డ్ కప్‌కి ఎంపికైనా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు..

27

‘యజ్వేంద్ర చాహాల్‌‌కి టీమిండియాలో ఉండే అర్హత లేదు. ఎందుకంటే అతను ఈ మధ్య కాలంలో అస్సలు నిలకడైన ప్రదర్శన ఇవ్వడం లేదు. భారీగా పరుగులు ఇచ్చేస్తున్నాడు. అలాంటప్పుడు అతన్ని ఆడించాలని బీసీసీఐ ఎలా అనుకుంటుంది..
 

37

కుల్దీప్ యాదవ్ చాలా పొదుపుగా బౌలింగ్ వేస్తున్నాడు. నిలకడైన ప్రదర్శనతో వికెట్లు తీస్తున్నాడు. మిడిల్ ఓవర్లలో టీమిండియాకి కీ బౌలర్‌గా మారాడు. సెలక్టర్లు ఈ ఇద్దరి మధ్యలో ఎవరు బెస్ట్ అనే ప్రశ్న వస్తే కచ్ఛితంగా కుల్దీప్ యాదవ్‌కే ఓటు వేస్తారు..

47
Yuzvendra Chahal Kudeep Yadav

యజ్వేంద్ర చాహాల్, వన్డే వరల్డ్ కప్ 2023 ఆడడంకూడా అనుమానమే. ఎందుకంటే ఆసియా కప్ తర్వాత టీమిండియాకి ఎక్కువ మ్యాచులు కూడా లేవు. అలాంటప్పుడు అతన్ని ప్రపంచ కప్ టీమ్‌లోకి ఎలా తీసుకొస్తారు? ఏ ప్రాతిపదిక మీద ఎంపిక చేస్తారు? 

57

కెఎల్ రాహుల్ ఎంపిక మాత్రం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే అతను టెస్టుల్లో బాగా ఆడకపోవడం వల్లే టీమ్‌లో చోటు కోల్పోయాడు. ఐపీఎల్‌లోనూ ఫెయిల్ అయ్యాడు. గాయంతో టీమ్‌కి దూరమై, కోలుకుని రీఎంట్రీ ఇస్తున్నాడు..

67
\\\\

ఫామ్‌లో లేని, గాయపడడానికి ముందు పరుగులు చేయలేకపోయిన కెఎల్ రాహుల్‌కి మరో అవకాశం ఇవ్వడం అన్యాయమే. ఎందుకంటే సంజూ శాంసన్ వన్డేల్లో చక్కగా ఆడుతున్నాడు. కెఎల్ రాహుల్‌ని రిజర్వు ప్లేయర్‌గా పెట్టి, సంజూ శాంసన్‌కి తుది జట్టులో చోటు ఇవ్వడమే న్యాయం....

77
Sanju Samson

చూస్తుంటే కెఎల్ రాహుల్‌కి ఉన్న ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగానే అతన్ని తుది జట్టులో నుంచి తప్పించడానికి టీమిండియా భయపడుతున్నట్టుగా ఉంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత కెఎల్ రాహుల్, ఇండియాలో ఓ స్టార్ ప్లేయర్. అదే అతన్ని కాపాడుతూ వస్తోంది..’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా.. 

click me!

Recommended Stories