రోహిత్ 3, జైస్వాల్ 4, అయ్యర్ 11.. జమ్మూ కాశ్మీర్ దెబ్బ‌ ముంబై ఇండియన్స్ అబ్బా !

Published : Jan 23, 2025, 07:38 PM IST

Ranji Trophy: ముంబై, జమ్మూ కాశ్మీర్ మధ్య రంజీ ట్రోఫీ మ్యాచ్ ముంబై వేదిక‌గా జరుగుతోంది. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్ లో ముంబై బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. స్టార్ ప్లేయ‌ర్లు సింగిల్ డిజిట్ కే పెవిలియ‌న్ కు చేరారు.   

PREV
16
రోహిత్ 3, జైస్వాల్ 4, అయ్యర్ 11.. జమ్మూ కాశ్మీర్ దెబ్బ‌ ముంబై ఇండియన్స్ అబ్బా !
Image Credit: Getty Images

Ranji Trophy: రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల తదుపరి రౌండ్ గురువారం నుంచి ప్రారంభ‌మైంది. ఇందులో పలువురు భారత స్టార్లు పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నందున దేశ‌వాళీ క్రికెట్ మ‌రోసారి కొత్త క‌ళ‌ను సంత‌రించుకుంది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, శుభ్‌మాన్ గిల్ వంటి స్టార్ ప్లేయ‌ర్లు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు కనీసం ఒక్క‌టైనా దేశవాళీ రెడ్ బాల్ గేమ్‌లు ఆడతారు.

26
Image Credits: Twitter/CricCrazyJohns

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ పరాజయం తర్వాత టీమిండియా అంద‌రూ ఆట‌గాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేన‌ని బీసీసీఐ కొత్త రూల్స్ తీసుకువ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. తిరిగి వారి ఫామ్ ను అందుకోవ‌డానికి ఎలా స‌హాయ ప‌డుతుదో చూడాలి. అయితే, భార‌త జ‌ట్టులో స్టార్లుగా ఉన్న ప్లేయ‌ర్లు మ‌ళ్లీ దేశవాళీ క్రికెటర్లతో క‌లిసి మ్యాచ్ ఆడ‌టం మ‌రింత ఆస‌క్తిని పెంచింది.

36
Rohit Sharma

ముంబై vs జమ్మూ కాశ్మీర్ మ్యాచ్ లో స్టార్ ప్లేయ‌ర్లు

రంజీ ట్రోఫీ 2025 రెండో దశ గురువారం ప్రారంభమైంది. ముంబైలోని బీకేసీ మైదానంలో ముంబై vs జమ్మూకశ్మీర్ మ్యాచ్ జరుగుతోంది. ముంబై జట్టుకు ఆడేందుకు రోహిత్ శర్మ మైదానంలోకి దిగడం ఈ మ్యాచ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రోహిత్ శ‌ర్మ మాత్రమే కాదు, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, శ్రేయాస్ అయ్యర్ వంటి స్టార్ ఆటగాళ్లు కూడా రంజీ మ్యాచ్‌లు ఆడేందుకు ముంబై తరఫున గ్రౌండ్ లోకి దిగారు.

46

ముంబై స్టార్ల ఫ్లాప్ షో 

ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ అజింక్యా రహానే టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ నిర్ణయం పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు ఆడే అవకాశం లభిస్తుంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత రోహిత్ శర్మ రంజీ ట్రోఫీ ఆడేందుకు మైదానంలోకి అడుగుపెట్టాడు. యశస్వితో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే వీరిద్దరిలో ఎవరికీ మంచి శుభారంభం లభించలేదు.

ఓపెనింగ్ బ్యాటింగ్‌లో య‌శ‌స్వి  జైస్వాల్  విజయవంతమైన ఫోర్ కొట్టాడు. అయితే ఆ తర్వాత వెంట‌నే అత‌ను ఔట్ అయి పెవిలియ‌న్ చేరాడు. జైస్వాల్ తర్వాత రోహిత్ శ‌ర్మ కూడా 3 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇది ముంబై టీమ్ కు సొంత మైదానం.. రోహిత్ కు కూడా..  కానీ ముంబై బ్యాట్స్‌మెన్ మాత్రం సొంత మైదానంలోనే ఫ్లాప్ షో చూపించారు.

56

ర‌హానే, దుబే, అయ్య‌ర్ కూడా..

రోహిత్ తర్వాత హార్దిక్ తమోర్ 7, అజింక్యా రహానే 12, శివమ్ దూబే 0, షామ్స్ ములానీ కూడా సున్నాకే పెవిలియ‌న్ చేరాడు. ఆ తర్వాత వ‌చ్చిన‌ శ్రేయాస్ అయ్యర్ కూడా 11 పరుగులకే పెవిలియ‌న్ బాట‌ప‌ట్టాడు. దీంతో ముంబై టీమ్ కేవలం 42 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.

మొత్తంగా ముంబై జ‌ట్టు 120 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. టీమ్ లో శార్ధుల్ ఠాగూర్ ఒక్క‌డే 51 ప‌రుగుల‌తో ముంబై స్కోర్ ను 120 ప‌రుగుల‌కు చేర్చాడు. జమ్మూకశ్మీర్‌ తరఫున బౌలింగ్‌లో ఉమర్ న‌జిర్, యుధ్ వీర్ సింగ్ లు చెరో 4 వికెట్లు తీసుకున్నారు. 

66
MD Nidheesh Kerala Ranji Trophy

ఒకే రోజు 17 వికెట్లు ప‌డ్డాయి.. 

జ‌మ్మూకాశ్మీర్ జ‌ట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 54 పరుగుల ఆధిక్యంతో 174/7తో తొలి రోజుని ముగించింది. ఒకే ఈ మ్యాచ్ లో తొలి రోజు 17 వికెట్లు ప‌డ్డాయి. రెండో రోజు జ‌మ్మూ త‌న ఆధిక్యాన్ని మ‌రింత పెంచుకోవాల‌ని చూస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో ఘోరంగా విఫ‌ల‌మైన టీమిండియా స్టార్లు రెండో ఇన్నింగ్స్ లోనైనా ప‌రుగులు చేస్తారో లేదో చూడాలి. 

జ‌మ్మూకాశ్మీర్ మ్యాచ్ కోసం ముంబై ప్లేయింగ్ 11 

యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, అజింక్య రహానే (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ తమోర్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, శార్దూల్ ఠాకూర్, షమ్స్ ములానీ, తనుష్ కొటియన్, మోహిత్ అవస్తీ, కర్ష్ కొఠారి.

Read more Photos on
click me!

Recommended Stories