మళ్లీ బ్యాటు పట్టనున్న సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్... రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022 షెడ్యూల్ ఖరారు..

Published : Dec 30, 2021, 07:35 PM IST

భారత మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి లెజెండరీ ప్లేయర్ల ఆటను మరోసారి అదృష్టం త్వరలోనే కలగనుంది. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టీ20 సీజన్ 2 వచ్చే ఏడాదిలో జరగనుంది...

PREV
111
మళ్లీ బ్యాటు పట్టనున్న సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్... రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022 షెడ్యూల్ ఖరారు..

2022 రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ (సీజన్ 2)ను భారత్‌తో పాటు, యూఏఈ వేదికగా నిర్వహించబోతున్నట్టు స్పష్టం చేశారు టోర్నీ నిర్వహకులు ఎమ్‌ఎస్‌పీఎల్, ఏఎన్‌జెడ్‌ఏ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్...

211

ఫిబ్రవరి 5, 2022 నుంచి ప్రారంభమయ్యే సీజన్ 2 రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్... ఫ్రిబవరి 5 నుంచి జనవరి 31 వరకూ ఇండియాలో జరుగుతుంది. ఆ తర్వాత మార్చి 1 నుంచి 19 వరకూ యూఏఈ వేదికగా మ్యాచులు జరుగుతాయి...

311

కరోనా కారణంగా వాయిదా పడి 2021 ఆరంభంలో లక్నో వేదికగా జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ సీజన్ 1 సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ మ్యాచులు చూసేందుకు ప్రేక్షకులు వేలాదిగా తరలి వచ్చారు...

411

అయితే ఈ సిరీస్‌లో పాల్గొన్న తర్వాత భారత మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, ఇర్పాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, బ్రదీనాథ్ తదితరులు కరోనా బారిన పడ్డారు. దీంతో ఈ సారి టోర్నీని ఎలా నిర్వహిస్తారనేది ఆసక్తికరంగా మారింది...

511

ప్రపంచవ్యాప్తంగా రోజూ వేల సంఖ్యలో ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు భద్రతపై జనాల్లో అవగాహన కల్పించాలనే మంచి ఉద్దేశంతో ఈ సిరీస్‌ను నిర్వహిస్తున్నారు.

611

దాదాపు 160 మంది అంతర్జాతీయ రిటైర్ అయిన ప్లేయర్లు, ఈ టీ20 టోర్నీలో పాల్గొనబోతున్నారు. మొదటి సీజన్‌ను సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలోని టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే...

711

సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌లతో పాటు యువరాజ్ సింగ్, బ్రియాన్ లారా, జాంటీ రోడ్స్, కార్ల్ హూపర్, తిలకరత్నే దిల్షాన్, సనత్ జయసూర్య, బ్రెట్ లీ వంటి లెజెండరీ క్రికెటర్లు మొదటి సీజన్‌లో పాల్గొన్నారు...

811

టీమిండియాతో పాటు శ్రీలంక, సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు మొదటి రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో పాల్గొన్నాయి. 

911

ఆరంభంలో మ్యాచులు ఆడిన ఆసీస్ లెజెండ్స్ కరోనా కారణంగా మధ్యలో తప్పుకోవడంతో ఆ స్థానంలో బంగ్లాదేశ్ వచ్చి, మ్యాచులు ఆడింది...

1011

వచ్చే ఏడాది శ్రీలంక వేదికగా రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ జరుగుతుందని ప్రచారం జరిగినా, అధికారికంగా ఖరారు కాలేదు. యూఏఈతో పాటు సౌతాఫ్రికా కూడా ఈ సిరీస్ నిర్వహించేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం...

1111

ఈ మధ్యనే అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్, వచ్చే సీజన్‌లో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఆడబోతున్నాడని సమాచారం..

click me!

Recommended Stories