ధోనీ, గంగూలీ, ద్రావిడ్ వల్ల కాలేదు, విరాట్ కోహ్లీ చేసి చూపించాడు... సఫారీ గడ్డను టీమిండియా అడ్డాగా...

First Published Dec 30, 2021, 5:16 PM IST

సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలవడమే లక్ష్యంగా సఫారీ గడ్డపై అడుగుపెట్టిన విరాట్ సేన, సెంచూరియన్ టెస్టులో చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ రికార్డుల పుస్తకంలో మరిన్ని రికార్డులు వచ్చి చేరాయి...

రెండు బాక్సింగ్ డే టెస్టులు గెలిచిన మొట్టమొదటి భారత కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ... ఇంతకుముందు ఎమ్మెస్ ధోనీ, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ రెండుసార్లు బాక్సింగ్ డే టెస్టుల్లో విజయాలు అందుకోలేకపోయారు...

ఈ విజయంతో సౌతాఫ్రికాపై అత్యధిక విజయాలు అందుకున్న భారత కెప్టెన్‌గా ఎమ్మెస్ ధోనీ రికార్డును అధిగమించాడు విరాట్ కోహ్లీ. మాహీ 16 మ్యాచుల్లో (అన్ని ఫార్మాట్లలో కలిపి) విజయాలు అందుకుంటే, విరాట్‌కి ఇది 17వ విజయం...

SENA (సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు 7 విజయాలు అందుకుంటే, రాహుల్ ద్రావిడ్, గంగూలీ, ఎమ్మెస్ ధోనీ కలిసి 7 విజయాలు అందుకోవడం విశేషం...

SENA దేశాలపై అత్యధిక విజయాలు అందుకున్న ఆసియా కెప్టెన్‌గానూ విరాట్ కోహ్లీ టాప్‌లో ఉన్నాడు. పాక్ కెప్టెన్లు వసీం అక్రమ్, జావెద్ మియాందద్ చెరో నాలుగు టెస్టుల్లో విజయాలు అందుకోగా, విరాట్ 7 విజయాలు అందుకున్నాడు...

సెంచూరియన్‌లో 19 ఏళ్ల తర్వాత తొలి విజయాన్ని అందుకుంది భారత జట్టు. ఇంతకుముందు అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో ఇక్కడ మ్యాచులు ఆడినా విజయాలు అందుకోలేకపోయింది టీమిండియా. విరాట్ కోహ్లీ టీమ్ దాన్ని సుసాధ్యం చేసింది...

ఈ విజయంతో అత్యధిక విజయాలు అందుకున్న ఆల్‌టైం టెస్టు సారథిగా తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు విరాట్ కోహ్లీ. గ్రేమ్ స్మిత్ 53, రికీ పాంటింగ్ 48, స్టీవ్ వా 41 టెస్టు విజయాలు అందుకుంటే, విరాట్ కోహ్లీకి ఇది 40వ టెస్టు విజయం...

సఫారీ గడ్డపై రెండు విజాయలు అందుకున్న మొట్టమొదటి భారత కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ. 

ఇంతకుముందు 2006లో రాహుల్ ద్రావిడ్, 2010లో ఎమ్మెస్ ధోనీ చెరో మ్యాచ్ గెలవగా, 2018లో టెస్టు విజయాన్ని అందుకున్న విరాట్, ఆ తర్వాత ఆడిన మొదటి టెస్టులోనూ విజయాన్ని అందుకున్నాడు..
 

click me!