ప్రపంచంలో బెస్ట్ వికెట్ కీపర్ కావాలనేది రిషబ్ పంత్ కల... సురేశ్ రైనా కామెంట్...

First Published | Jan 31, 2021, 10:45 AM IST

ఆస్ట్రేలియా పర్యటనలో మరోసారి అదరగొట్టి, తనపైన వస్తున్న విమర్శలకు ఘాటైన సమాధానం చెప్పాడు భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్. సిడ్నీ టెస్టులో 97 పరుగులు, గబ్బాలో అజేయంగా 89 పరుగులు చేసిన పంత్, ఆస్ట్రేలియా టూర్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. వరల్డ్ బెస్ట్ వికెట్ కీపర్ కావాలనేది రిషబ్ పంత్ కోరికని అంటున్నాడు మాజీ క్రికెటర్ సురేశ్ రైనా...

రిషబ్ పంత్‌కీ, తనకీ మంచి అనుబంధం ఉందని, పంత్ గురించి తనకు పూర్తిగా అవగాహన ఉందని అంటున్నాడు మాజీ క్రికెటర్ సురేశ్ రైనా...
‘భాయ్... నేను ఎలాగైనా వరల్డ్‌లోనే ది బెస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కావాలి... ఇదే నా టార్గెట్ అని తరుచూ నాతో అంటూ ఉంటాడు రిషబ్ పంత్...

నాకూ, రిషబ్ పంత్‌కి చాలా మంచి అనుబంధం ఉంది. అతను తరుచూ మా ఇంటికి వస్తూ ఉంటాడు. కానీ అతను సాధించిన దానికీ, నాకూ ఎలాంటి సంబంధం లేదు...
నేను రిషబ్ పంత్‌కి ఎలాంటి శిక్షణా, సలహాలు ఇవ్వలేదు. పంత్ కూడా ఎప్పుడూ నన్ను వాటి గురించి అడగలేదు... అతను చాలా టాలెంటెడ్ ప్లేయర్...
భవిష్యత్తులో టీమిండియా నుంచి స్టార్‌గా ఎదగబోయే ప్లేయర్‌లలో రిషబ్ పంత్ పక్కాగా ఉంటానని నా నమ్మకం... అతనిలో అంతటి సత్తా ఉంది...
కొన్ని నెలలుగా రిషబ్ పంత్ పర్ఫామెన్స్‌పై చాలా ట్రోల్స్ వస్తున్నాయి. నేను కూడా గమనించాను.. కానీ వాటికి తన ఆటతోనే సమాధానం చెప్పాలని పంత్ భావించాడు..
అతను ఫామ్ కోల్పోయినప్పుడు కూడా సీనియర్ బ్యాట్స్‌మెన్లని ఎలాంటి సూచనలు, సలహాలు అడగలేదు...
రిషబ్ పంత్, మా పిల్లలతో కలిసి ఆడుకోవడాన్ని బాగా ఎంజాయ్ చేస్తాడు. కామెడీ సినిమాలు చూస్తాడు... మరీ ముఖ్యంగా ఇష్టమైన ఫుడ్ అడిగి మరీ తెప్పించుకుంటాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు సురేశ్ రైనా...
రిషబ్ పంత్ కొన్నాళ్ల కిందట మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యామిలీతో కలిసి ఓ పార్టీలో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి..
ధోనీకి సన్నిహితుడైన సురేశ్ రైనాతో కూడా రిషబ్ పంత్‌కి మంచి బాండింగ్ ఉండడంలో పెద్ద విశేషం ఏముందని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు...

Latest Videos

click me!