పంత్ మా ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్ కాదు.. బాంబు పేల్చిన రాహుల్ ద్రావిడ్

First Published Sep 4, 2022, 4:53 PM IST

Asia Cup 2022: టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఈ ఏడాది  అక్టోబర్ లో టీ20  ప్రపంచకప్ ఆడనున్న టీమిండియాలో ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్ గా ముందు వరుసలో ఉన్నాడు. కానీ.. 
 

భారత క్రికెట్ జట్టులో మునుపెన్నడూ లేనంతగా గత ఏడాదికాలంగా వికెట్ కీపర్లలో పోటీ ఎక్కువైంది.  ఆల్ ఫార్మాట్ వికెట్ కీపర్ గా ఉన్న రిషభ్ పంత్  కు కూడా జట్టులో ప్లేస్ దక్కుతుందా..? లేదా..? అనేది మ్యాచ్ ప్రారంభమయ్యే సమయం వరకు సస్పెన్స్ గానే మారింది.  

రిషభ్ పంత్ కు ప్రధానంగా దినేశ్ కార్తీక్ నుంచి  పోటీ ఉంది. రీఎంట్రీ తర్వాత కార్తీక్.. మెరుపు ప్రదర్శనలతో జట్టులో సుస్థిర స్థానం ఏర్పరుచుకుంటున్నాడు. వచ్చే టీ20 ప్రపంచకప్ లో ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న కార్తీక్ ఆ మేరకు సఫలీకృతుడవుతున్నాడు. 

Image credit: PTI

టీమిండియా  కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా టీ20లలో పంత్ కంటే దినేశ్ కార్తీక్ ను ఆడించడమే ఉత్తమమని భావిస్తున్నారు. ఆసియా కప్-2022లో భాగంగా  గత ఆదివారం పాకిస్తాన్ తో ముగిసిన మ్యాచ్ లో  రోహిత్ శర్మ.. రిషభ్ పంత్ ను కాదని  దినేశ్ కార్తీక్ నే తుది జట్టులోకి తీసుకున్నాడు. 

అయితే దీనిపై విమర్శలు వెల్లువెత్తినా జట్టు మాత్రం కార్తీక్ కే మద్దతుగా నిలిచింది.  మరి ఈ ఇద్దరిలో రానున్న టీ20   ప్రపంచకప్ ఆడేది ఎవరు..? అనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకడం లేదు. 
 

తాజాగా  రాహుల్ ద్రావిడ్ ఇదే విషయమై ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.  రిషభ్ పంత్ ను మేం ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్ గా భావించడం లేదని బాంబు పేల్చాడు. పాకిస్తాన్ తో మ్యాచ్ కు ముందు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ద్రావిడ్ మాట్లాడుతూ.. ‘అసలు జట్టులో ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్ అనే ఆప్షన్ లేదు.  మేము పరిస్థితులకు తగ్గట్టుగా ఆడుతున్నాం. 

Image credit: PTI

మ్యాచ్ పరిస్థితులు,  ప్రత్యర్థి తదితర  అంశాల ఆధారంగా మేం జట్టును ఎంపిక చేస్తున్నాం. అప్పటికి అదే బెస్ట్ అనిపిస్తుంది. అసలు మా జట్టులో ఫస్ట్ ఛాయిస్ అనే  భావనే లేుద. ప్రతీసారి అది వర్కవుట్ అవదు. 
 

Image credit: PTI

పాకిస్తాన్ తో  మ్యాచ్ లో మేం దినేశ్ కార్తీక్ అయితే బాగుంటుంది అనుకున్నాం. అందుకే అతడితో వెళ్లాం. మా జట్టులో 15 మంది అత్యద్భుతమైన ఆటగాళ్లున్నారు. పరిస్థితులకు తగ్గట్టు ఎవరిని ఎంపిక చేయాలో మ్యాచ్ కు ముందు నిర్ణయిస్తాం..’ అని తెలిపాడు. 

click me!