తిలక్ వర్మ కంటే రింకూ సింగ్‌ని సెలక్ట్ చేసి ఉంటే బాగుండేది! - ఆకాశ్ చోప్రా...

Published : Jul 07, 2023, 01:03 PM IST

వెస్టిండీస్ టూర్‌లో టెస్టు టీమ్‌కి ప్రకటించిన జట్టులో సర్ఫరాజ్ ఖాన్ లేకపోవడం, టీ20 సిరీస్‌కి ప్రకటించిన జట్టులో రింకూ సింగ్ లేకపోవడం తీవ్ర వివాదాస్పదమయ్యాయి. టెస్టు టీమ్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కి చోటు ఇవ్వడాన్ని తప్పుబడిన ఫ్యాన్స్, టీ20 టీమ్‌లో అతనికి అవకాశం ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతున్నారు..  

PREV
17
తిలక్ వర్మ కంటే రింకూ సింగ్‌ని సెలక్ట్ చేసి ఉంటే బాగుండేది! - ఆకాశ్ చోప్రా...

వెస్టిండీస్ పర్యటనలో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచులు ఆడనుంది భారత జట్టు. టీ20 సిరీస్‌కి ప్రకటించిన జట్టులో తిలక్ వర్మతో పాటు యశస్వి జైస్వాల్, ముకేశ్ కుమార్‌లకు చోటు కల్పించారు సెలక్టర్లు...

27
Rinku SIngh

‘మిడిల్ ఆర్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్‌తో పాటు హార్ధిక్ పాండ్యా, తిలక్ వర్మలకు అవకాశం ఇచ్చారు. తిలక్ వర్మను మూడో స్థానంలో ఆడిస్తారని మాత్రం నేను అనుకోవడం లేదు. హార్ధిక్ పాండ్యా తర్వాత బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న ఐదో స్థానం బ్యాటర్ కోసం చూస్తున్నారు..

37

ఆ ప్లేస్‌లో తిలక్ వర్మ కంటే రింకూ సింగ్ కరెక్టుగా సెట్ అవుతాడు. తిలక్ వర్మను మూడో స్థానంలో ఆడించే ఉద్దేశం ఉంటే అతన్ని సెలక్ట్ చేయడం కరెక్ట్. అయితే ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ ఉండడంతో తిలక్ వర్మ, టాపార్డర్‌లో బ్యాటింగ్‌కి రావడం కష్టమే..’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా...

47
Image credit: PTI

‘తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్ వంటి కుర్రాళ్లకు అవకాశం ఇచ్చారు. రింకూ సింగ్‌ని మాత్రం పట్టించుకోలేదు.ఐపీఎల్ తర్వాత తనకి అవకాశం వస్తుందని రింకూ సింగ్ ఆశపడ్డాడు. అయితే టీమ్‌కి సెలక్ట్ కానంత మాత్రాన అతను దిగులుతో కూర్చోడనే అనుకుంటున్నా..

57
Image credit: PTI

రాకపోతే రాకపోనీ, నేను ప్రయత్నిస్తూనే ఉంటా.. అనుకునే రకం రింకూ సింగ్. ఇంకా బాగా ఆడాలని అనుకుంటాడు. భారత జట్టులో చోటు కోసం ఇంకేం చేయాలో దాన్ని కనిపెట్టే పనిలో ఉండి ఉంటాడు...
 

67
Image credit: PTI

ఐపీఎల్ 2023 సీజన్‌లో రింకూ ఆడిన కొన్ని ఇన్నింగ్స్‌ల తర్వాత అతన్ని మీడియా బిగ్ ప్లేయర్‌గా చూపిస్తోంది. జనాలు కూడా అదే అనుకుంటున్నారు. రింకూ బ్యాటింగ్‌కి వచ్చిన ప్రతీసారీ ఏదో మ్యాజిక్ ఆశిస్తున్నారు...
 

77

నాకున్న గట్టి నమ్మకం ఏంటంటే రింకూ సింగ్, కేవలం టీ20ల్లోనే కాదు, టీమిండియాకి టెస్టు, వన్డేల్లోనూ ఆడగలడు, మ్యాచులు గెలిపించగలడు. రింకూ కూడా టెస్టుల్లో ఆడాలని ఆశపడుతున్నాడు.. అందుకోసమే కష్టపడుతున్నాడు.. ’ అంటూ కామెంట్ చేశాడు రింకూ సింగ్ కోచ్ మసూద్ అమినీ.. 

 

click me!

Recommended Stories