అతని కంటే ముందు నన్నే కోచ్‌గా రమ్మని అడిగారు! టైమ్ లేదని చెప్పా... - రికీ పాంటింగ్...

Published : Jun 24, 2023, 11:20 AM IST

గత డబ్ల్యూటీసీ సీజన్‌లో మొదటి 12 మ్యాచుల్లో రెండే విజయాలు అందుకున్న ఇంగ్లాండ్ జట్టు, బెన్ స్టోక్స్ కెప్టెన్‌గా, బ్రెండన్ మెక్‌కల్లమ్ టెస్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుస విజయాలు అందుకుంది...

PREV
16
అతని కంటే ముందు నన్నే కోచ్‌గా రమ్మని అడిగారు! టైమ్ లేదని చెప్పా... - రికీ పాంటింగ్...

గత యాషెస్ సిరీస్‌లో 0-4 తేడాతో చిత్తుగా ఓడింది ఇంగ్లాండ్ జట్టు. ఈ ఓటమి తర్వాత క్రిస్ సిల్వర్‌వుడ్, టెస్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్, ఇంగ్లాండ్‌కి టెస్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు... 

26
Ricky Ponting-McCullum

బ్రెండన్ మెకకల్లమ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాక బజ్‌బాల్ కాన్సెప్ట్‌ని నెత్తిన పెట్టుకున్న ఇంగ్లాండ్ జట్టు, వరుస విజయాలతో దూసుకొచ్చింది. జో రూట్ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో బెన్ స్టోక్స్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్, 10 మ్యాచుల్లో 8 విజయాలు అందుకుంది.. 

36

బ్రెండన్ మెక్‌కల్లమ్‌కి ముందు ఇంగ్లాండ్ హెడ్ కోచ్‌గా చాలామంది పేర్లు వినిపించాయి. ఆసీస్ మాజీ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ కూడా ఇంగ్లాండ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. అయితే కొన్నిరోజులకే వార్న్, ప్రాణాలు కోల్పోయాడు..
 

46
Ricky Ponting

‘బ్రెండన్ మెక్‌కల్లమ్‌ కంటే ముందు ఇంగ్లాండ్ హెడ్ కోచ్‌గా రావాల్సిందిగా నన్ను కోరారు. అయితే అంతర్జాతీయ జట్టుకి ఫుల్ టైమ్ కోచ్‌గా చేసేందుకు నేను సిద్ధంగా లేను. ప్రస్తుతం నా వ్యక్తిగత జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను..

56

నా కుటుంబానికి సమయం కేటాయిస్తున్నా. నా పిల్లలతో కలిసి తిరగడానికే సమయం సరిపోవడం లేదు.  అంతర్జాతీయ టీమ్‌కి హెడ్ కోచ్‌గా చేస్తే విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది, కుటుంబానికి దూరంగా బతకాల్సి వస్తుంది..

66

బ్రెండన్ మెక్‌కల్లమ్‌తో ఈ విషయం గురించి కూడా మాట్లాడాను. అతని కుటుంబం కూడా తనతో పాటు ఉండడం లేదు. స్కూల్‌కి వెళ్లే పిల్లలు ఉన్నప్పుడు ఇలా వారిని ఇబ్బంది పెట్టడం నేను చేయలేను...’ అంటూ కామెంట్ చేశాడు రికీ పాంటింగ్...

click me!

Recommended Stories