RCBvsMI: హర్షల్ పటేల్ మ్యాజిక్... ముంబై ఇండియన్స్‌ బ్యాట్స్‌మెన్ ఢీలా...

First Published Apr 9, 2021, 9:29 PM IST

ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో 8 బౌలర్లతో బరిలో దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మంచి బౌలింగ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది.  టాస్ ఓడి, మొదట బ్యాటింగ్ చేసిన ఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి  పరుగులు చేసింది. ముంబై తరుపున మొదటి మ్యాచ్ ఆడుతున్న క్రిస్ లీన్ పరుగులు చేయగా చేశారు...

ఐపీఎల్ 2021 సీజన్‌లో మొదటి పరుగు, మొదటి ఫోర్, మొదటి సిక్సర్ బాదిన రోహిత్ శర్మ, మొదటి వికెట్‌గా కూడా పెవిలియన్ చేరాడు. 15 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేసిన రోహిత్ శర్మ రనౌట్ అయ్యాడు.
undefined
24 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్‌ను సూర్యకుమార్ యాదవ్, క్రిస్ లీన్ కలిసి ఆదుకున్నారు. రోహిత్ శర్మ అవుటైన తర్వాత సిక్సర్లతో విరుచుకుపడిన క్రిస్ లీన్... సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి 70 పరుగులు జోడించాడు.
undefined
23 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 31 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, జెమ్మీసన్ బౌలింగ్‌లో ఏబీ డివిల్లియర్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
undefined
ఐపీఎల్ 2021 సీజన్‌లో మొట్టమొదటి వికెట్ తీసిన బౌలర్‌గా నిలిచాడు రూ.15 కోట్లతో కొనుగోలు చేసిన కేల్ జెమ్మీసన్..
undefined
ఆ తర్వాత 35 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 49 పరుగులు చేసిన క్రిస్ లీన్, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
undefined
10 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. హార్ధిక్ పాండ్యా రివ్యూ తీసుకున్నా, బంతి వికెట్లను తాకుతున్నట్టు కనిపించడంతో ఫలితం లేకుండా పోయింది.
undefined
ఓసారి వాషింగ్టన్ సుందర్, మరోసారి సిరాజ్ క్యాచ్ డ్రాప్ చేయడంతో బతికిపోయిన ఇషాన్ కిషన్ 19 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 28 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
undefined
హర్షల్ పటేల్ బౌలింగ్‌‌లో అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా, రివ్యూకి వెళ్లిన ఆర్‌సీబీకి అనుకూలంగా ఫలితం దక్కింది. ఇషాన్ కిషన్ అవుటైన తర్వాత కృనాల్ పాండ్యా ఇచ్చిన క్యాచ్‌ను జారవిడిచాడు విరాట్ కోహ్లీ...
undefined
అయితే 20వ ఓవర్ వేసిన హర్షల్ పటేల్ మ్యాజిక్ చేశాడు. మొదటి బంతికి కృనాల్ పాండ్యాను అవుట్ చేసిన హర్షల్ పటేల్, తర్వాతి బంతికి కిరన్ పోలార్డ్ వికెట్ తీశాడు.
undefined
మూడో బంతికి వికెట్ రాకపోయినా నాలుగో వికెట్‌కి మార్కో జెన్సన్‌ను డకౌట్ చేసిన హర్షల్ పటేల్... ఐదు వికెట్లు పూర్తి చేసుకున్నాడు. 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు హర్షల్ పటేల్.
undefined
ఆఖరి బంతికి రాహుల్ చాహార్ రనౌట్ కావడంతో 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. ఆఖరి 4 ఓవర్లలో 31 పరుగులు చేసిన ముంబై ఆరు వికెట్లు కోల్పోయింది.
undefined
click me!