8 మంది బౌలర్లతో బరిలోకి... ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆర్‌సీబీ డిఫరెంట్ స్ట్రాటెజీ...

Published : Apr 09, 2021, 07:40 PM IST

టెస్టు, వన్డే, టీ20... ఫార్మాట్ ఏదైనా జట్టులో ఐదుగురు లేదా ఆరుగురు బౌలర్లు ఉంటారు. అయితే ఐపీఎల్ 2021 వేలంలో కోట్లు కుమ్మరించి ప్లేయర్లను కొనుగోలు చేసిన ఆర్‌సీబీ మాత్రం భిన్నమైన స్ట్రాటెజీతో బరిలో దిగుతున్నట్టు కనిపిస్తోంది. మొదటి మ్యాచ్‌లో 8 మంది బౌలర్లతో బరిలో దిగడమే దీనికి ప్రధాన కారణం...

PREV
110
8 మంది బౌలర్లతో బరిలోకి... ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆర్‌సీబీ డిఫరెంట్ స్ట్రాటెజీ...

చాలా రోజుల తర్వాత టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ... ఏ మాత్రం ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌ను పాజిటివ్ ఎనర్జీతో ఆరంభించాలని చూస్తోంది విరాట్ సేన...

210

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టులో చోటు దక్కించుకున్నవారిలో ఏకంగా 8 మంది బౌలర్లు ఉండడం విశేషం. యజ్వేంద్ర చాహాల్, కేల్ జెమ్మీసన్, మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, షాబజ్ అహ్మద్‌లను బౌలర్లుగా ఎంచుకున్నాడు విరాట్ కోహ్లీ...

310

వీరితో పాటు తుది జట్టులో చోటు దక్కించుకున్న డానియల్ క్రిస్టియన్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఆల్‌రౌండర్లుగా ఉన్నారు.... బ్యాటింగ్ భారాన్ని ఏబీడీ, విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్ మోయనుండడంతో బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేయడానికి ప్రాధాన్యం ఇచ్చాడు కోహ్లీ...

410

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటి మ్యాచ్ ఆడడం ఇది మూడోసారి కాగా... ముంబై ఇండియన్స్‌కి 8వసారి. అత్యధిక సార్లు ఆరంభ మ్యాచ్ ఆడిన జట్టుగా సీఎస్‌కేను అధిగమించి టాప్‌లో నిలిచింది ముంబై...

510

ఇంతకుముందు చెన్నైతో కలిసి ఐదుసార్లు ఆరంభ మ్యాచులు ఆడిన ముంబై ఇండియన్స్, కేకేఆర్‌తో కలిసి రెండు సార్లు ఐపీఎల్ సీజన్ మొట్టమొదటి మ్యాచ్‌లు ఆడింది...

610

చెపాక్ స్టేడియంలో ఆడిన గత ఐదు మ్యాచుల్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గత ఐదు మ్యాచుల్లోనూ ఓడింది..

710

చివరిసారిగా చెపాక్ మైదానంలో 2011 క్వాలిఫైయర్ 2లో ముంబై ఇండియన్స్‌ను 43 పరుగుల తేడాతో ఓడించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

810

గత మూడు సీజన్లలోనూ ఆరంభ మ్యాచ్‌లో రెండో సారి బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయం దక్కింది. ఈ సెంటిమెంట్‌తోనే టాస్ గెలవగానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు విరాట్ కోహ్లీ...

910

చివరిసారిగా 2016లో ఏప్రిల్ 9న ప్రారంభమైంది. ఆ సీజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కైవసం చేసుకోగా, ముంబై ఇండియన్స్ ఐదో స్థానంలో నిలిచింది..

1010

2020 సీజన్‌లో కేవలం 15 మంది ప్లేయర్లతోనే ఆడి, టైటిల్ గెలిచింది ముంబై ఇండియన్స్... క్రిస్ లీన్ వంటి విధ్వంసకర ప్లేయర్లకు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు... 2021 సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే అతను ఎంట్రీ ఇవ్వడం విశేషం.

click me!

Recommended Stories