ఆర్‌సీబీ క్రేజ్ అంటే ఆ మాత్రం ఉంటది... అర్ధరాత్రి వరకూ సాగిన ఎలిమినేటర్ మ్యాచ్‌కి అదిరిపోయే...

Published : May 27, 2022, 04:26 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌ విజేత మరో రెండు మ్యాచుల్లో తేలిపోనుంది. వరుసగా మూడో సీజన్‌లోనూ ప్లేఆఫ్స్‌ చేరిన ఒకే ఒక్క జట్టుగా రికార్డు క్రియేట్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... 2016 తర్వాత క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడబోతోంది. దీంతో ఆర్‌సీబీ ఫ్యాన్స్ ‘ఈ సాలా కప్ నమ్‌దే’ అని గట్టిగా ఫిక్స్ అయిపోయారు...

PREV
18
ఆర్‌సీబీ క్రేజ్ అంటే ఆ మాత్రం ఉంటది... అర్ధరాత్రి వరకూ సాగిన ఎలిమినేటర్ మ్యాచ్‌కి అదిరిపోయే...

ఐపీఎల్‌లో గత రెండు సీజన్లలో ఎలిమినేటర్ మ్యాచుల్లో ఓడి నాలుగో స్థానానికి పరిమితమైన ఆర్‌సీబీ, ఈసారి ఆ గండాన్ని దాటి రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ వరకూ వచ్చింది...

28

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌ వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం కావడంతో మ్యాచ్ ముగిసే సమయానికి అర్ధరాత్రి దాటింది. అయితే ఆర్‌సీబీ ఫ్యాన్స్ మాత్రం చివరిదాకా ఆశలు కోల్పోలేదు...

 

38

తమ ఫేవరెట్ టీమ్ క్వాలిఫైయర్‌కి వెళ్తుందా? లేదా? అనే ఆశతో టీవీలకు, మొబైళ్లకు అత్తుకుపోయారు ఆర్‌సీబీ ఫ్యాన్స్... దీంతో ఎలిమినేటర్ మ్యాచ్‌కి రికార్డు వ్యూయర్‌షిప్ వచ్చింది...

48
Image credit: PTI

భారీ అంచనాలతో 10 జట్లతో ప్రారంభమైన ఐపీఎల్ 2022 సీజన్‌ మ్యాచులకు పెద్దగా టీఆర్పీ రాలేదు. ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్ 2’ సినిమాలతో పాటు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్లు లీగ్ స్టేజీకే పరిమితం కావడం సీజన్‌పై భారీగా ప్రభావం చూపింది...

58

లీగ్ మ్యాచుల సమయంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రియల్ టైమ్ వ్యూస్ 20 లక్షల నుంచి 50 లక్షలను దాటలేదంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ‘El Classico’ ఆఫ్ ఐపీఎల్‌గా చెప్పుకునే ముంబై ఇండియన్స్ వర్సెస్ సీఎస్‌కే మ్యాచ్‌కి మంచి వ్యూయర్‌షిప్ వచ్చింది...

68
Image credit: PTI

ఈ మ్యాచ్‌ సమయంలో రియల్ టైమ్ వ్యూస్ అత్యధికంగా 8.3 మిలియన్లకు చేరాయి. తాజాగా ఈ రికార్డును ఎలిమినేటర్ మ్యాచ్ అధిగమించింది. రజత్ పటిదార్ సెంచరీకి చేరువైన సమయంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రియల్ టైమ్ వ్యూస్ మార్క్ 8.7 మిలియన్లను తాకింది...

78

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇదే అత్యధికం. వర్షం కారణంగా మ్యాచ్ పూర్తి కావడానికి అర్ధరాత్రి 12 గంటల 20 నిమిషాలు అయినా ప్రేక్షకులు ఎవరు గెలుస్తారా? అనే ఆసక్తిగా వీక్షించారు... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్‌తో ఆడే రెండో క్వాలిఫైయర్‌కి కూడా మంచి వ్యూయర్‌షిప్, టీఆర్పీ వచ్చే అవకాశం ఉంది...

88
Image credit: PTI

ఐపీఎల్ 2022 సీజన్‌లో అత్యధిక టీఆర్పీ, వ్యూయర్‌షిప్ వచ్చిన మ్యాచ్ ఇదే. లేటుగా అయినా ఐపీఎల్ 2022 సీజన్ ముగింపు దశలో వ్యూయర్‌షిప్ పెరగడం, బీసీసీఐకి గుడ్‌న్యూసే...
 

click me!

Recommended Stories