నాకు జోస్ బట్లర్ రెండో భర్త అయ్యాడు.. రాజస్తాన్ రాయల్స్ ఆటగాడి భార్య షాకింగ్ కామెంట్స్..

Published : May 27, 2022, 04:03 PM IST

IPL 2022: ఐపీఎల్-15లో అత్యధిక  పరుగుల వీరుడు జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. సీజన్ లో నిలకడగా రాణిస్తున్న బట్లర్.. తనకు రెండో భర్త అయ్యాడని అంటున్నది సౌతాఫ్రికా  క్రికెటర్  వాన్ డర్ డసెన్ భార్య.   

PREV
17
నాకు జోస్ బట్లర్ రెండో భర్త అయ్యాడు.. రాజస్తాన్ రాయల్స్ ఆటగాడి భార్య షాకింగ్ కామెంట్స్..

ఈ సీజన్ లో  రాజస్తాన్ రాయల్స్ తరఫున అదిరిపోయే ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న జోస్ బట్లర్ ను తనకు రెండో భర్తగా చెప్పుకుంది దక్షిణాఫ్రికా  బ్యాటర్ వాన్ డర్ డసెన్ భార్య లారా డసెన్. 

27

తాజాగా ఆమె  రాజస్తాన్ రాయల్స్ ఫ్యామిలీ ఫోడ్కాస్ట్ లో ఈ సంచలన కామెంట్స్ చేసింది.  ఇందుకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఆమె మాటల్లోనే.. 

37


‘ప్రజలు నన్ను జోస్ బట్లర్ భార్య అనుకుంటున్నారు. ఎందుకంటే బట్లర్ సిక్సర్, ఫోర్ కొట్టినప్పుడు.. హాఫ్ సెంచరీనో లేక సెంచరీనో చేసినప్పుడు కెమెరామెన్ నన్నే చూపిస్తున్నాడు. 

47

నేను ధనశ్రీ (యుజ్వేంద్ర చాహల్ భార్య) తో కలిసి బట్లర కు మద్దతుగా స్టేడియంలో  రాజస్తాన్ ఆటగాళ్లను ఉత్సాహపరిచేందుకు స్టాండ్స్ లో కూర్చుంటున్నాం. అయితే బట్లర్ సిక్సర్ కొట్టినప్పుడల్లా కెమెరామెన్ నన్నే చూపించడంతో అందరూ నేనే బట్లర్ వైఫ్ అనుకుంటున్నారు. 

57

ఇది చూస్తుంటే బట్లర్ నాకు రెండో భర్త అయినట్టు ఉంది. కానీ బట్లర్ నా భర్త కాదు.  బట్లర్ భార్య లూయిస్. ఆమె నాకు తెలుసు.అంతుకుముందు నేను ఆమెను కలవలేదు.  ఈ సీజన్ సందర్బంగానే ఆమెను కలిశాను.  

67

నేను దక్షిణాఫ్రికా క్రికెటర్ రస్సీ వాన్ డర్ డసెన్ భార్యను. అసలు విషయమేమిటంటే డసెన్ ప్రస్తుత సీజన్ లో ఎక్కువ మ్యాచులు ఆడలేదు. కానీ నేను స్టాండ్స్ లోకి వచ్చి మా జట్టుకు మద్దతు తెలుపుతున్నాను.  బట్లర్ భార్యేమో   మ్యాచులు చూడటానికి రావడం లేదు... అందుకే ప్రజలు నన్ను బట్లర్ భార్య అనుకుంటున్నారు..’ అని వివరణ ఇచ్చింది. 

77

నేడు  రాజస్తాన్ రాయల్స్.. రెండో క్వాలిఫైయర్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు  మే 29 న అహ్మదాబాద్ లో గుజరాత్ టైటాన్స్ తో తలపడుతుంది. 

click me!

Recommended Stories