ప్రతీ ఐపీఎల్ సీజన్‌కి ముందు టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగుతుంటుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. విరాట్ కోహ్లీ కారణంగా ఎన్ని సీజన్లు ఫెయిల్ అయినా, ఆర్‌సీబీకి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. 2023 సీజన్‌ని ఘనంగా ప్రారంభించిన ఆర్‌సీబీ, రెండో మ్యాచ్‌లోనే చేతులు ఎత్తేసింది...
ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్ కలిసి తొలి వికెట్‌కి 148 పరుగులు జోడించారు. ఫాఫ్ డుప్లిసిస్ అవుటైనా విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌తో కలిసి మ్యాచ్‌ని ముగించాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్ త్వరత్వరగా అవుట్ కావడంతో ఆర్‌సీబీ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగుతున్నట్టు కనిపించలేదు..
‘ఈ ఏడాది విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆర్‌సీబీ బ్యాటింగ్ ఎక్కువగా అతనిపైనే ఆధారపడి ఉంది. అయితే ఎంత ఫామ్‌లో ఉన్న బ్యాటర్ అయినా ప్రతీ మ్యాచ్‌లో బాగా ఆడడం సాధ్యం కాని పని. విరాట్ కోహ్లీ ఆడితే ఆర్‌సీబీ విజయావకాశాలు పెరుగుతాయి...
37
విరాట్ కోహ్లీ బాగా ఆడితే ఒక్క ఆర్‌సీబీ ఫ్యాన్స్ మాత్రమే కాదు, క్రికెట్ ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. కారణం విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అతను ఇప్పుడు క్రికెట్ సూపర్ స్టార్. అయితే ఏ ఒక్కడిపైనో, ఇద్దరిపైనే టీమ్ బ్యాటింగ్ ఆధారపడినంత కాలం టైటిల్స్ రావు. ఆర్‌సీబీకి ఇప్పటిదాకా టైటిల్ రాకపోవడానికి ఇదే కారణం...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...
47
‘విరాట్ కోహ్లీ మొదటి 2 మ్యాచుల్లో 103 పరుగులు చేశాడు. అయితే అతను ఇదే ఫామ్‌ని కొనసాగిస్తాడనే గ్యారెంటీ లేదు. ఒకవేళ అతను మంచి ఫామ్‌లో పరుగులు చేస్తే మాత్రం ఆర్‌సీబీ విజయాలు అందుకుంటుంది. అయితే విరాట్ పైనో, లేక ఫాఫ్ డుప్లిసిస్ పైన ఆధారపడడం కరెక్ట్ కాదు. మిగిలిన బ్యాటర్లు కూడా బాధ్యత తీసుకుని పరుగులు చేయాల్సిన అవసరం ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్..
‘నా వరకూ ఆర్‌సీబీ మిడిల్ ఆర్డర్ చాలా వీక్‌గా కనిపిస్తోంది. టాపార్డర్‌లో విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్ త్వరగా అవుట్ అయితే వాళ్లు 150 పరుగులు కూడా చేయలేకపోతున్నారు. ప్రత్యర్థి టీమ్ ఈ ఇద్దరు వికెట్లు తీసుకుంటే చాలు, మిగిలిన వికెట్లు వాటంతట అవే వస్తున్నాయి...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ...
67
Image credit: PTI
గత సీజన్‌లో ఆర్‌సీబీకి మ్యాచ్ ఫినిషర్‌గా వ్యవహరించిన దినేశ్ కార్తీక్, ఈ సీజన్‌లో మొదటి రెండు మ్యాచుల్లో ఫెయిల్ అయ్యాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా తొలి రెండు మ్యాచుల్లో పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. గత సీజన్‌లో ఆర్‌సీబీ తరుపున సెంచరీ చేసిన రజత్ పటిదార్, గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు..
77
ఆర్‌సీబీకి మిడిల్ ఆర్డర్‌లో కీ బ్యాటర్‌గా ఉన్న ఏబీ డివిల్లియర్స్ రిటైర్మెంట్ తర్వాత మళ్లీ అలాంటి బ్యాటర్‌ని వెతికి పట్టుకోలేకపోయింది టీమ్ మేనేజ్‌మెంట్. దనిేశ్ కార్తీక్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ కొన్ని మ్యాచుల్లో ఫినిషర్లుగా వ్యవహరించినా, ఏబీ డివిల్లియర్స్‌లా నిలకడ చూపించలేకపోతున్నారు..